ETV Bharat / state

భాజపాలో చేరడం లేదు: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి

author img

By

Published : Mar 15, 2021, 7:04 PM IST

konda vishweshwar reddy
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్​ పార్టీకి తాను రాజీనామా చేయడం లేదని.. మూడు నెలల తర్వాత ఏ నిర్ణయమనేది చెప్తానని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి తాను రాజీనామా చేయలేదని.. ఆ పార్టీకి మూడు నెలలపాటు దూరంగా ఉండాలని మాత్రమే నిర్ణయించుకున్నట్లు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో భాజపాకు చెందిన జాతీయ నాయకులు కొండాను కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన కమలంలోకి వెళ్తున్నట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భాజపాలోకి చేరుతున్నట్లు జరిగిన ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది.

తాను భాజపాలోకి చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని విశ్వేశ్వర్​ రెడ్డి స్పష్టం చేశారు. మూడు నెలల తరువాత ఏ పార్టీలో చేరాలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

ఇదీ చదవండి: ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోండి: చాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.