ETV Bharat / state

పర్యావరణ హితమే లక్ష్యంగా ఈ బైక్స్​ పెట్రోలింగ్​

author img

By

Published : May 26, 2021, 11:45 AM IST

e bikes patrolling in madapur
మాదాపూర్​లో ఈ బైక్స్​ పెట్రోలింగ్​

పర్యావరణ పరిరక్షణలో భాగంగా లాక్​డౌన్​ సమయంలో ఈ బైక్స్​తో పోలీసులు పెట్రోలింగ్​ నిర్వహించారు. మొదటగా హైదరాబాద్​ మాదాపూర్​ పీఎస్​ పరిధిలో ఎలక్ట్రానిక్​ బైక్స్​తో రహదారులపై పెట్రోలింగ్​ చేపట్టారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు మరో ప్రయోగాన్ని మొదలుపెట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమవంతుగా లాక్​డౌన్ సమయంలో పెట్రోలింగ్ నిర్వహించేందుకు ఈ బైక్స్ పెట్రోలింగ్ విధానాన్ని ప్రారంభించారు. మొదటగా మాదాపూర్ పీఎస్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది ద్విచక్రవాహనాలపై చక్కర్లు కొడుతూ లాక్​డౌన్ విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే వంద కిలోమీటర్లు రావడం.. అలాగే పర్యావరణ పరిరక్షణకు ఈ బైక్స్ ఎంతగానో దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.

మాదాపూర్ పీఎస్​ పరిధిలో విజయవంతం కావడంతో ఇక సైబరాబాద్ కమిషనరేట్​లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ బైక్స్ పెట్రోలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బయోమాస్‌ వినియోగంపై జాతీయ మిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.