BRS MPs on Hindenburg report in Parliament : అదానీ కంపెనీల వ్యవహారంలో హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు పార్లమెంటులో విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావింత చేసే అంశం కాబట్టే వాయిదా తీర్మానం ఇచ్చామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పక్షనేత కె.కేశవరావు అన్నారు. ఒక్క రోజులోనే అదానీ గ్రూప్‌కి చెందిన 27 శాతం షేర్లు పతనం కావడం దేశానికి నష్టం కలిగిస్తుందన్నారు. ఇలాంటి విషయంలో సభ ఆర్డర్‌లో లేదని వాయిదా వేయడం సరికాదని కేకే విమర్శించారు.
'ఆర్థిక అంశం కాబట్టే వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ జరగాలని కోరాం. ఒక్క రోజులో అదానీ గ్రూప్‌కి చెందిన 27 శాతం షేర్లు పతనమయ్యాయి. 27% పతనం కావడం ఆర్థిక వ్యవస్థకు నష్టం. సభ ఆర్డర్‌లో లేదని వాయిదా వేయడం సరికాదు. గతంలోనూ హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ స్కాంలు జరిగాయి. వాటిపై జరిగినట్లే ఆదానీ కంపెనీలపైనా చర్చ జరగాలి. కేంద్రం లాభాలు ప్రైవేటుకు పంచి, నష్టాలు ప్రభుత్వరంగంపై వేస్తోంది' - కె.కేశవరావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పక్షనేత
ఇక అదానీ షేర్లు, హిండన్‌బర్గ్ నివేదికపై జేపీసీ వేయాలని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. హిండన్‌బర్గ్ నివేదికపై సీజేఐతో దర్యాప్తు జరిపించాలని పేర్కొన్నారు. ఎల్ఐసీ, ప్రభుత్వ బ్యాంకుల్లో కోట్లమంది ప్రజల పెట్టుబడులు ఉన్నాయని ఖర్గే వెల్లడించారు.
ఇవీ చూడండి: