ETV Bharat / state

జోరందుకున్న బీఆర్​ఎస్​ ఇంటింటా ప్రచారం

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 8:06 PM IST

BRS Assembly Elections Campaign 2023 : ఓవైపు నామినేషన్లు, మరోవైపు ప్రచారాలతో బీఆర్​ఎస్​ పార్టీ జోరు పెంచింది. తొమ్మిదిన్నరేళ్ల పాలనలోని సంక్షేమం, ప్రగతిని వివరిస్తూ కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్‌రావులు నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తున్నారు. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ మరోసారి బీఆర్​ఎస్​కే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల సైతం నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

Telangana Latest Political News
BRS Assembly Elections Campaign 2023
జోరందుకున్న బీఆర్​ఎస్​ ఇంటింటా ప్రచారం

BRS Assembly Elections Campaign 2023 : రాష్ట్రంలో మరోసారి గులాబీ జెండా ఎగరేసేలా భారత రాష్ట్ర సమితి(BRS) ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కేసీఆర్​ భరోసా(BRS Manifesto 2023) పేరుతో కొత్త హామీలిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ అభ్యర్థి లాస్య నందిత.. నేతాజీనగర్‌, బోయిన్​పల్లి ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.

గుర్తుల గుర్తుంచుకో రామక్క - మా పార్టీని గుర్తుంచుకో రామక్క ప్రధాన పార్టీల నోట రామక్క పాట ఇప్పుడిదే టాప్ ట్రెండింగ్

Telangana Assembly Elections 2023 : శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్​ఎస్​ అభ్యర్థి.. అరికేపూడి గాంధికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న కార్పోరేటర్‌ వెంకటేశ్​గౌడ్‌ బ్యాండ్‌ మోగిస్తూ పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఆధ్వర్యంలో దాదాపు 500 మంది గులాబీ కండువా కప్పుకున్నారు. మేడ్చల్‌ జిల్లాలోని జవహర్‌ నగర్‌ నుంచి అంబేఢ్కర్ కూడలి వరకు మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) భారీ ర్యాలీ నిర్వహించారు.

కూకట్‌పల్లి బీఆర్​ఎస్​ అభ్యర్థి మాధవరం కృష్ణారావు కాలనీల అసోసియేషన్‌, కుల సంఘాలు, బూత్‌ కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మైనార్టీ సోదరులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిర్మల్‌ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాలనీలు, కులసంఘ భవనాల్లో సమావేశాలు నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.

Telangana Latest Political News : నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని సిద్దాపూర్‌, చింతల్‌పేట్‌, పైడిమల్‌ గ్రామాల్లో పోచారం శ్రీనివాస్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలంలో సునీతా రెడ్డి ప్రచారంలో చిన్నారులు బీఆర్​ఎస్​ జెండాలతో నృత్యం చేశారు. మెదక్‌ జిల్లా ములుగు మండలంలో సీఎం కేసీఆర్​కు మద్దతుగా బీఆర్​ఎస్​ నేతలు ప్రచారం నిర్వహించారు.

సంగారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో చింతా ప్రభాకర్‌కు గజమాలలు, టపాసులు పేలూస్తూ స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి.. హవేలీ ఘన్​పూర్​ మండలంలోని కుచాన్​పల్లి, ముత్తాయికోట గ్రామాలలో పర్యటించారు. గ్రామస్థులు డప్పు చప్పులు, బతుకమ్మ బోనాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు.

హనుమకొండ జిల్లా దామెర మండలంలో ప్రచారం నిర్వహించిన చల్లా ధర్మారెడ్డి కారు గుర్తుకే ఓటేయాలని ఓటర్లను కోరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలో నల్లమోతు భాస్కర్‌రావు ఓట్లు అభ్యర్థించారు. యాదాద్రి జిల్లా ఆలేరులోని తుర్కపల్లి మండలంలో గొంగిడి సునీత ప్రచారం నిర్వహిస్తూ బీఆర్​ఎస్​ను మరోసారి గెలిపించాలని కోరారు.

ఊపందుకున్న ఎన్నికల ప్రచారం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు

BRS 30 Days Election Campaign Plan : బీఆర్ఎస్​ సరికొత్త ప్లాన్​.. విజయం సాధించేందుకు 'స్వాతిముత్యం' ఫార్ములా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.