ETV Bharat / state

BJP Leaders Election Campaign in Telangana : బీజేపీ ఎన్నికల ప్రచార జోరు.. బీసీ సీఎం నినాదంతో ముందుకు..

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 8:42 PM IST

BJP Leaders Election Campaign in Telangana : రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులు.. వారి వారి నియోజకవర్గాలలో.. ప్రచారాన్ని ప్రారంభించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రధానంగా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

BJP Leaders Election Campaign
BJP Leaders Election Campaign in Telangana

BJP Leaders Election Campaign in Telangana బీజేపీ ఎన్నికల ప్రచార జోరు.. బీసీనే సీఎం నినాదంతో ముందుకు

BJP Leaders Election Campaign in Telangana : శాసనసభ ఎన్నికల ప్రచారం(Telangana Poll 2023)లో బీజేపీ జోరు పెంచింది. రాష్ట్రంలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. బీసీను ముఖ్యమంత్రి చేస్తానన్న ప్రకటనతో.. బీసీ సంఘాల నుంచి విశేష స్పందన వస్తుందని ఆయన అన్నారు. దమ్ము, ధైర్యమున్న బీజేపీ పార్టీ.. తప్పకుండా చెప్పిన హామీని అమలు చేస్తుందన్నారు. హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్మల్ జిల్లాకు చెందిన పలువు నేతలు.. కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయదళంలో చేరారు. అధికారంలోకి రాగానే మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని.. బీసీ, ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు.

"భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైన చర్యల ద్వారా ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేస్తే.. యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో అలాగే చేసే పరిస్థితులు వస్తాయి. అది ఎంఐఎం పార్టీ కావచ్చు, విద్రోహ శక్తులు కావచ్చు ఎవరి మీదైనా బుల్డోజర్​లతో స్పందిస్తాం. తెలంగాణ ఇస్తామని చెప్పిన అనేక మంది ప్రాణాలతో ఆటలాడుకున్న కాంగ్రెస్​ పార్టీని. బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తారని.. తాము బీసీనే ప్రధానమంత్రిని చేశాం. అలాంటిది ముఖ్యమంత్రిని చేయలేమా?." - కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

BJP Leaders Comments on BRS Congress : 'బీఆర్ఎస్, కాంగ్రెస్.. బీసీలను మోసం చేశాయి.. కానీ ఓబీసీని పీఎం చేసిన ఘనత బీజేపీది'

Bandi Sanjay Fires on KTR : రాష్ట్రంలోని పేదలంతా ఏకమై.. బీసీ ముఖ్యమంత్రిని గెలిపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ ముఖ్యమంత్రిని నియమిస్తామని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని అన్నారు. కరీంనగర్​లో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్.. బీసీలను అవమానించేలా మాట్లాడిన కేటీఆర్​ మాటలకు కేసీఆర్​ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

"ఆనాడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్​.. ఈనాడు ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదు. బీసీలు ముఖ్యమంత్రిని చేసే ఆలోచన లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కుండబద్ధలు కొట్టి చెప్పారు. కేటీఆర్​ బీసీలపై మాట్లాడిన విధానం కరెక్టు కాదు. అందుకు బీసీ సంఘాలు, బీసీల గురించి ఆలోచించే వారు మేల్కొవాలి. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంపై క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది." - బండి సంజయ్​, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Telangana Assembly Election 2023 : కేసీఆర్ నిజాం సర్కార్ కంటే ఎక్కువ హుకుం జారీచేసి.. దౌర్జన్యం చేసి అధికారం హస్తగతం చేసుకొంటున్నారని.. భాజపా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌ ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ గెలిస్తే హుకుంలే ఉంటాయంటూ జోస్యం చెప్పారు. హైదరాబాద్‌ శివారు శామీర్ పేటలోని ఈటల రాజేందర్ నివాసంలో.. గజ్వేల్ నియోజకవర్గం బీజేపీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. బీసీ నాయకుడిని సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో.. సికింద్రాబాద్​ ఓల్డ్​ బోయిన్​పల్లి డివిజన్​లో ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆధ్వర్యంలో పలువురు బీఆర్​ఎస్​ నేతలు బీజేపీలో చేరారు. బీజేపీ మూడో జాబితా కోసం.. ఆయా నియోజకవర్గాల్లో నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Kishan Reddy on Opponent Parties : తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం : కిషన్ రెడ్డి

BJP Telangana Assembly Elections Strategy 2023 : బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లేలా వ్యూహాలు​.. RSS నేతలతో కలిసి ప్రచారంపై ప్రణాళికలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.