ETV Bharat / state

మద్యం సేవించినా... హెల్మెట్​ ధరించకున్నా ఈ బైక్ నడవదు

author img

By

Published : Nov 23, 2019, 6:21 AM IST

మద్యం సేవించినా... హెల్మెట్​ ధరించకున్నా ఈ బైక్ నడవదు

పెరుగుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేసేలా... పెట్రోలు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కాస్తా ఊరటనిచ్చేలా గీతాంజలి కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థులు వినూత్న కాలుష్య రహిత ద్విచక్రవాహనాన్ని కనుగొన్నారు. అంతే కాదండోయ్ అత్యవసర పరిస్థితుల్లో దీనితో ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. సరికొత్త ఫీచర్లు తనలో దాచుకున్న ఈ బైక్​ని మీరు ఓ లుక్కేయండి.

కాలుష్య నివారణ నగరంగా తీర్చిదిద్దడమే ముఖ్య ఉద్దేశంగా... హైదరాబాద్ నగర శివారు చేర్యాలలోని గీతాంజలి కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థులు కాలుష్య రహిత ద్విచక్రవాహనాన్ని తయారు చేశారు. కళాశాల ఛైర్మన్, అధ్యాపకుల ప్రోత్సాహంతో కాలుష్య రహిత బ్యాటరీ వాహనాన్ని యువ ఇంజనీర్లు తయారు చేశారు.
గంట ఛార్జింగ్ పెడితే...
కేవలం గంటసేపు ఛార్జింగ్ పెడితే 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఎలాంటి కాలుష్యాన్ని వెదజల్లకుండా ప్రయాణం చేసేలా దీనిని రూపొందించారు. ఈ వాహనాన్ని దొంగలించినా జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా సులభంగా కనిపెట్టవచ్చు.
ఏదైనా జరిగితే...
ఈ బైకుకు మరో ప్రత్యేకత ఉంది. మద్యం సేవించి వాహనం నడిపినా, హెల్మెట్ ధరించకపోయినా ముందుకు కదలదు. మార్గమధ్యంలో ఆగిపోయినా, ఏదైనా ప్రమాదం జరిగిన పోలీసులకు, కుటుంబసభ్యులకు, అంబులెన్స్​కు సమాచారాన్ని చేరవేస్తుందని విద్యార్థులు పేర్కొన్నారు.
ప్రోత్సాహిస్తే మరెన్నో...
రెండు బైక్​ల తయారీకి లక్ష ఆరు వేలు ఖర్చు అయినట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని కళాశాల యాజమాన్యమే భరించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహిస్తే మరిన్ని కాలుష్యరహిత వాహనాలను అతి తక్కువ ఖర్చుతో తయారు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

మద్యం సేవించినా... హెల్మెట్​ ధరించకున్నా ఈ బైక్ నడవదు

ఇవీ చూడండి: సెక్షన్​ 29పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తర్జనభర్జన

Intro:TG_HYD_19_20_MLKG_BATTERY_BIKE_PKG_TS10015
contributor: satish_mlkg, 9394450282

యాంకర్: ప్రస్తుతం పెరుగుతున్న జనాభా ఆధారంగా కాలుష్య నివారణ నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్య ఉద్దేశం తో హైదరాబాద్ నగరం శివారులోని గీతాంజలి కళాశాల యువ ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక వినూత్న కాలుష్య రహిత ద్విచక్రవాహనాన్ని కనుగొన్నారు.

వాయిస్ ఓవర్1: మేడ్చల్ జిల్లా కిసర మండలం చేర్యాల లోని గీతాంజలి కళాశాల చైర్మన్ అధ్యాపకులు ప్రోత్సాహంతో కాలుష్య రహిత బ్యాటరీ వాహనాన్ని ఎంతో శ్రమించి యువ ఇంజనీర్లు తయారు చేశారు.

వాయిస్ ఓవర్2: ఈ వాహనం యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం గంట చార్జింగ్ చేస్తే 70 నుండి 80 కిలోమీటర్ల వరకు ఎలాంటి కాలుష్యాన్ని వెదజల్లకుండా ప్రయాణం చేయవచ్చని, ఈ వాహనాన్ని ఎవరైనా దొంగతనాలకు పాల్పడిన విద్యుత్ లైట్ తో పాటు ఉందని ఈ బ్యాటరీ వాహనాన్ని దొంగిలించిన అప్పుడు సులభంగా జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా ఎక్కడ ఉందో కనిపెట్టండి తెలిపారు. ఇప్పటివరకు ఈ వాహనంపై ఒక్కరు మాత్రమే ప్రయాణం3 చేయవచ్చని బ్యాటరీ సామర్థ్యం పెంచినట్లయితే ఇద్దరు ప్రయాణం చేయవచ్చని ఖర్చు ఒక లక్ష ఆరు వేలు మాత్రమే అని ఇంజనీర్లు తెలిపారు.

వాయిస్ ఓవర్3: ఈ బైకు మరో ప్రత్యేకత మద్యం సేవించి నడిపిన హెల్మెట్ ధరించకపోయినా ముందుకు కదలదని మార్గమధ్యంలో బైక్ ఆగిపోయిన ప్రమాదం జరిగిన సమాచారం పోలీసులకు 108 సమాచారాన్ని చేరవేస్తుంది అన్నారు.

వాయిస్ ఓవర్4: యువ ఇంజనీర్లు ప్రభుత్వం ప్రోత్సహించి నట్లయితే మరిన్ని కాలుష్యరహిత వాహనాలను అతి తక్కువ ఖర్చుతో ప్రవేశ పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

వాయిస్ ఓవర్4: ఈ యువ ఇంజనీర్లు కలలకు కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, తోటి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అభినందించారు.

బైట్1: రవీందర్ రెడ్డి(గీతాంజలి కళాశాల చైర్మన్)
బైట్2: మనీష్ రెడ్డి(యువ ఇంజనీర్)
బైట్3: సంతోష్(యువ ఇంజనీర్)
బైట్4: రాహుల్ రెడ్డి(యువ ఇంజనీర్)
బైట్5: శివప్రసాద్ (అధ్యాపకుడు)


Body:బ్యాటరీ


Conclusion:బ్యాటరీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.