ETV Bharat / state

3 Crore Worth of Ganja Seized by Police : సైబరాబాద్​లో మరో గంజాయి గ్యాంగ్​ అరెస్ట్​.. రూ.3 కోట్లు విలువైన సరుకు స్వాదీనం

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2023, 5:50 PM IST

CP Ravindra Latest Press Meet
Ganjay Smlaggling Gang Arrest in Telangana

3 Crore Worth of Ganja Seized by Police : సైబరాబాద్ పోలీసులు మరోసారి భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రెండు గ్యాంగులను అరెస్ట్ చేసిన పోలీసులు సుమారు 1228 కిలోల సరుకు పట్టుకున్నారు. దీని విలువ 3 కోట్లకు పైగా ఉంటుందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

3 Crore Worth of Ganja Seized by Police : మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న రెండు గ్యాంగులను సైబరాబాద్ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. మహారాష్ట్ర, హర్యానాకు చెందిన ఈ రెండు ముఠాలు వేర్వేరుగా తరలిస్తున్న మూడు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 1228 కిలోల గంజాయి(Marijuana Case)ని స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్​ సీపీ స్టీఫెన్​ రవీంద్ర తెలిపారు.

రెండు కేసుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక పిస్టల్, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పట్టుబడ్డ నిందితులపై గతంలో కూడా కేసులున్నాయని సీపీ తెలిపారు. నిందితులు ఆంధ్రప్రదేశ్​ నుంచి మహారాష్ట్రకి తెలంగాణ మీదుగా గంజాయి సరఫరా చేస్తున్నారని స్పష్టం చేశారు.

SI Rajendra Narcotics case in Hyderabad : గతంలో కూడా గంజాయిని పక్క రాష్ట్రం నుంచి తెలంగాణ మీదుగా వేరొక రాష్ట్రానికి గంజాయిని వివిధ వాహనాల్లో తరలించిన నిందితులను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారని వివరించారు. అనంతరం మాదక ద్రవ్యాల కేసులో అదుపులోకి తీసుకున్న ఎస్సై రాజేంద్ర(SI Rajendra)​ కేసు విషయాలు తెలిపారు. మాదక ద్రవ్యాల కేసులో ఎస్సై రాజేంద్రకి ఎవరెవరితో సంబంధాలున్నాయో.. తెలుసుకునే విధంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. కానిస్టేబుళ్లపై ఈ కేసుతో సంబంధం ఉందా? లేదా? అనే కోణంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే రాజేంద్రని ఈ కేసు విషయంలో సస్పండ్ చేసినట్లు గుర్తు చేశారు.

SI Rajendra Drugs Case Update : డ్రగ్స్​ కేసులో కొనసాగుతున్న విచారణ.. ఎస్సై రాజేంద్ర రెండు రోజుల కస్టడీ

A Woman Transporting Drugs Case in Hyderabad : తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు కొత్తగా ఏర్పాటు చేసిన మోకా పోలీసులు మరోసారి హైదరాాబాద్​లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. హైదరాబాద్​లోని ఓ మహిళ గోవా నుంచి డ్రగ్స్​ తీసుకువస్తోందన్న పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్​కి చెందిన అనురాధ(34) మత్తు పదార్థాలకు అలవాటు పడి.. తరువాత తనే స్వయంగా ఈ బిజినెస్​లోకి దిగింది. గోవాలో డ్రగ్స్​ విక్రయించే నైజీరియన్​ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. భాగ్యనగరంలో పలు చోట్ల టిఫిన్​ షాపులు నిర్వహిస్తున్న ప్రభాకర్​రెడ్డితో పరిచయం పెంచుకుని.. గోవా నుంచి తెస్తున్న మత్తు పదార్థాలను అతడికి ఇచ్చేది. అతను ఆ టిఫిన్​ సెంటర్లకి వచ్చే కొంత మందితో పరిచయం పెంచుకుని విక్రయించేవాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ నెల 10వ తేదీన డ్రగ్స్​తో వస్తున్న ఆమెను పట్టుకున్నారు. పట్టుకున్న సరుకు విలువ రూ.14 లక్షలు ఉంటుంది.

Narcotics Bureau SP Sunitha Reddy Interview : 'మాదాపూర్ డ్రగ్స్ కేసు.. నిందితుల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు'

Hyderabad SI Rajendra Drugs Case Update : డ్రగ్స్ కేసు అప్డేట్.. SI రాజేంద్ర కాల్​డేటాలో అసలుగుట్టు

Hyderabad Drugs Case Update : టాలీవుడ్​లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. నిర్మాత వెంకట్ అరెస్టుతో వారిలో కలవరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.