ETV Bharat / sports

ఓటమెరుగని పాక్​- చివరి లీగ్​ మ్యాచ్​లోనూ ఘన విజయం

author img

By

Published : Nov 7, 2021, 10:56 PM IST

T20 World Cup
టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) పాకిస్థాన్ అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది. గ్రూప్​ దశలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్​ కూడా ఓడని ఆ జట్టు.. ఆదివారం స్కాట్లాండ్​పైనా ఘన విజయం సాధించింది.

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021-pak vs sco) అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న పాకిస్థాన్‌ తన ఆఖరి మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. ఆదివారం స్కాట్లాండ్‌పై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్​ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో స్కాట్లాండ్​ చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. రిచీ బెరింగ్టన్ (54)​ ఒంటరి పోరాటం చేశాడు. పాక్​ బౌలర్లలో షాదాబ్​ ఖాన్​ 2, హసన్ అలీ, షహీన్ అఫ్రిది తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబర్ అజామ్‌ (66: 47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), షోయబ్ మాలిక్ ( 18 బంతుల్లో 54*: ఒక ఫోర్‌, 6 సిక్సర్లు) అద్భుత అర్ధశతకాలతో భారీ స్కోరు సాధించింది. తొలుత నిదానంగా ఆడిన పాక్‌.. ఆఖర్లో చెలరేగింది. మహమ్మద్‌ రిజ్వాన్‌ (15)తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బాబర్ మొదట్లో ఆచితూచి ఆడాడు. ఫఖర్ జమాన్ (8) విఫలం కాగా.. మహమ్మద్‌ హఫీజ్‌ (31) ధాటిగా ఆడాడు. అయితే ఆఖర్లో మాలిక్ విశ్వరూపం చూపాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో గ్రీవ్స్‌ 2.. తహిర్, షరిఫ్ చెరో వికెట్ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.