ETV Bharat / sports

హామిల్టన్​ ఖాతాలో మరో విజయం

author img

By

Published : Nov 2, 2020, 7:14 AM IST

ఫార్ములా వన్ రేసర్​ లూయిస్​ హామిల్టన్(ఇంగ్లాండ్​).. ఆదివారం జరిగిన ఎమీలియా రొమాగ్నా గ్రాండ్​ ప్రి రేసులో విజేతగా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్ హామిల్డన్​కిది 93వ గ్రాండ్​ ప్రి టైటిల్.

hamilton
హామిల్డన్​

ఫార్ములా వన్​ ట్రాక్​పై ప్రపంచ ఛాంపియన్​ లూయిస్​ హామిల్టన్​ జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన ఎమీలియా రొమాగ్నా గ్రాండ్​ ప్రి రేసులో అతను విజేతగా నిలిచాడు. హామిల్డన్​కిది 93వ గ్రాండ్​ ప్రి టైటిల్​.

ఇప్పటికే అతను దిగ్గజ రేసర్​ షుమాకర్​(91) రికార్డును బద్దలు కొట్టాడు. రేసును రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన మెర్సిడెజ్​ రేసర్​ హామిల్టన్​​ గంటా 28 నిమిషాల 32.430 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. మెర్సీడెజ్​కే చెందిన బొటాస్​, రెనాల్డ్​ డ్రైవర్​ రిసియార్డో వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు.

ఇదీ చూడండి ఆర్సీబీ X దిల్లీ: రెండో స్థానంలో నిలిచేది ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.