ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన రఫేల్ నాదల్.. గ్రాండ్​స్లామ్స్​@21

author img

By

Published : Jan 30, 2022, 10:36 PM IST

rafale nadal
రఫేల్ నాదల్

Australian Open 2022: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఆస్ట్రేలియన్ ఓపెన్​ పురుషుల సింగిల్స్​ ఫైనల్లో విజయం సాధించాడు స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్. యువ ఆటగాడు మెద్వెదెవ్​ను ఓడించాడు. దీంతో అత్యధికంగా 21 గ్రాండ్​స్లామ్​లు గెలిచిన వీరుడిగా నిలిచాడు.

Australian Open 2022: ఓ పక్క గాయాలు.. మరోవైపు పెరుగుతున్న వయస్సు.. కుర్రాళ్లతో పోటీ.. అయితే ఇవేమీ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును సాధిద్దామనే కలను ఆపలేకపోయాయి. పాతికేళ్ల యువకుడు మెద్వెదెవ్‌ మీద 35 ఏళ్ల రఫెల్‌ నాదల్ ఐదు సెట్ల పోరులో దాదాపు 5 గంటల 24 నిమిషాలపాటు పోరాడి మరీ విజయం సాధించాడు. 2-6, 6-7, 6-4, 6-4,7-5 తేడాతో మెద్వెదెవ్​ను ఓడించడం సంచలనమనే చెప్పాలి.

అయితే.. ఆస్ట్రేలియన్ ఓపెన్​ 2022లో దిగ్గజ టెన్నిస్​ స్టార్లు జకోవిచ్‌, రోజర్‌ ఫెదరర్‌ లేకపోయినా మెద్వెదెవ్, సిట్సిపాస్‌, వెరెవ్‌, బెరెట్టిని వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. వారందరినీ తోసిరాజని తన అనుభవంతో నాదల్ 21వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది తన రెండో ఆస్ట్రేలియన్‌ ఓపెన్ టైటిల్‌ కావడం విశేషం.

2012 జకోవిచ్​ చేతిలో..

తొలుత 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్​ టైటిల్​ గెలిచిన రఫేల్.. 13 ఏళ్ల తర్వాత రెండోసారి ఈ టైటిల్​ను గెలిచి రికార్డు సృష్టించాడు. అయితే.. 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోనూ మారథాన్​ మ్యాచ్​ ఆడి గెలుపుకోసం పోరాడాడు. కానీ, నొవాక్ జకోవిచ్​ చేతిలో పరాభవం పాలయ్యాడు. ఈ మ్యాచ్​ దాదాపు 5 గంటల 53 నిమిషాల పాటు జరిగింది. జకోవిచ్ 5-7, 6-4, 6-2, 6-7(5-7), 7-5 తేడాతో నాదల్​ను ఓడించి టైటిల్​ను ఎగరేసుకుపోయాడు.

నాదల్@21..

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 విజయంతో.. 20 గ్రాండ్​స్లామ్ టైటిళ్లలో అగ్రస్థానంలో ఉన్న ఫెదరర్, జకోవిచ్​లను నాదల్​ అధిగమించాడు. ఈ నేపథ్యంలో నాదల్​ మధుర క్షణాలను ఓసారి వీక్షిద్దాం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

Australian Open 2022: రఫేల్​దే టైటిల్.. పోరాడి ఓడిన మెద్వెదెవ్

IND vs WI: యువ ఆటగాళ్లు షారుక్, సాయి కిశోర్​కు బంపర్ ఆఫర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.