ETV Bharat / sports

Fifa Worldcup: కెప్టెన్​ హెడర్​ షాట్​.. ట్రోఫిని ముద్దాడిన వేళ దిగ్గజ ఆటగాళ్లకు షాక్​​!

author img

By

Published : Dec 1, 2022, 12:02 PM IST

Fifa Heder shot 1998 worldcup
Fifa Worldcup: కెప్టెన్​ హెడర్​ షాట్​.. ట్రోఫిని ముద్దాడిన వేళ దిగ్గజ ఆటగాళ్లకు మైండ్ బ్లాక్​!

అది 1998 ప్రపంచకప్‌. అయితే ఆ మెగాటోర్నీలో ఫ్రాన్స్​ జట్టు కెప్టెన్​ ఆడిన హెడర్​ షాట్​ను ఫుట్​ బాల్ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే అతడు ఓ కెప్టెన్​గా జట్టును సమన్వయం చేస్తూ ఫైనల్​ మ్యాచ్​లో ఆ షాట్​తో ట్రోఫిని ముద్దాడాడు. జట్టును ముందుండి ఎలా నడిపించాలో ప్రపంచానికి చూపించాడు. ఓ సారి ఆ మ్యాచ్ సంగతులను నెమరువేసుకుందాం..

కెప్టెన్​.. ఏ క్రీడలోనైనా ఎంతో ఒత్తిడితో కూడిన బాధ్యత. క్లిష్ట పరిస్థితుల్లోనూ సరైన నిర్ణయాలను తీసుకుంటూ జట్టును ముందుండి నడిపించడం, ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపడం అతడి తొలి కర్తవ్యం. అయితే ఓ సారథిగా ఎప్పుడూ ముందుండి జట్టును ఎలా నడిపించాలో ప్రపంచానికి చూపించాడు ఫ్రాన్స్‌ ఆటగాడు జినెడిన్‌ జిదానే.

అది 1998 ప్రపంచకప్‌. ఈ మెగా టోర్నీకి ఫ్రాన్స్‌ ఆతిథ్యం ఇచ్చింది. అప్పటికే ఈ టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన ఉరుగ్వే, ఇటలీ, ఇంగ్లాండ్‌, వెస్ట్‌ జర్మనీ, అర్జెంటీనా జట్లు సొంతగడ్డపై ఛాంపియన్లుగా అవతరించాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా ట్రోనీఫి ముద్దాడాలని ఫ్రాన్స్‌ ఆటగాళ్లు బలంగా నిర్ణయించుకొన్నారు. లీగ్ దశ నుంచి ఫైనల్స్‌ వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి అనేదే లేకుండా ముందుకు సాగారు. కెప్టెన్‌ జిదానే జట్టును సమన్వయం చేసుకొంటూ విజయపథంలో నడిపించాడు. అయితే.. టోర్నీలో అతడు అప్పటి వరకు ఒక్కగోల్‌ కూడా ( క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఇటలీపై పెనాల్టీ షూట్‌లో మినహా) చేయకపోవడం గమనార్హం.

ఇక మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బ్రెజిల్‌ కూడా ఫైనల్స్‌ చేరుకొంది. బెబెటో, రొనాల్డో, రివాల్డో, కాఫు, కార్లోస్‌, లియోనార్డో వంటి స్టార్‌ ఆటగాళ్లతో ఆ జట్టు బలంగా ఉంది. 1994 ప్రపంచ విజేత కూడా. రొనాల్డో అప్పటికే టోర్నీలో 4 గోల్స్‌ చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఫ్రాన్స్‌ తరఫున లిలియాన్‌ మాత్రమే ఆ టోర్నీలో అప్పటి వరకు జట్టులో అత్యధికంగా రెండు గోల్స్‌ చేశాడు. కాకపోతే జట్టులో దాదాపు ఏడుగురు ఆటగాళ్లు కనీసం ఒక్క గోలైనా చేశారు. అంటే సమష్టిగా రాణిస్తున్నారని అర్థం.

ఇక ఫైనల్‌లో దిగ్గజ బ్రెజిల్‌ను ఢీకొనేందుకు ఫ్రాన్స్‌ జట్టును జిదానే ముందుండి నడిపించాడు. తమ గోల్‌పోస్ట్‌ను ఫ్రాన్స్‌ ఆటగాళ్లు డిఫెన్స్‌తో దుర్బేధ్యంగా మార్చేశారు. బ్రెజిల్‌ స్ట్రైకర్లు చేసిన దాడులను తిప్పికొట్టారు. మ్యాచ్‌ 27వ నిమిషంలో ఫ్రాన్స్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది. అద్భుతమైన హెడర్‌ షాట్‌తో దానిని జిదానే గోల్‌గా మలిచాడు. మ్యాచ్‌ తొలి అర్ధభాగం ముగియడానికి నిమిషం ముందు ఫ్రాన్స్‌కు మరో పెనాల్టీ కార్నర్‌ లభించింది. ఫ్రాన్స్‌ ఆటగాడు యారీ రఫీ జోర్కేఫ్‌ కొట్టిన షాట్‌ను మళ్లీ జిదానే తన హెడర్‌తో గోల్‌గా మలిచాడు. ఈ మ్యాచ్‌లో జిదానే చేసిన రెండు గోల్స్‌ హెడర్‌ షాట్లతో రావడం విశేషం. ఆ తర్వాత బ్రెజిల్‌ ఏ దశలోనూ ఫ్రాన్స్‌ రక్షణ వలయాన్ని ఛేదించలేకపోయింది. మ్యాచ్‌ చివరి నిమిషంలో లిలియాన్‌ మరో గోల్‌ చేయడంతో ఫ్రాన్స్ విజయం సంపూర్ణమైంది. స్టార్లతో నిండిన బ్రెజిల్‌ ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అది ఫుట్​బాల్​ క్రేజ్​.. 40వేల అడుగుల ఎత్తులోనూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.