ETV Bharat / sports

WTC Finalకు అంతా రెడీ.. షెడ్యూల్​, ప్రైజ్​మనీ సహా ఈ వివరాలు తెలుసా?

author img

By

Published : Jun 6, 2023, 3:13 PM IST

WTC Final 2023 Prize money
WTC Final 2023 : షెడ్యూల్​, ప్రైజ్​మనీ సహా ఈ వివరాలు తెలుసా?

WTC Final 2023 Teamindia vs Australia : ఇంకో రోజులో ప్రతిష్టాత్మక వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌ షిప్‌(#WTC Final 2023) ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫైనల్​ పోరు ఎక్కడ జరగనుంది? ఎక్కడ చూడాలి? ప్రైజ్‌మనీ ఎంత? జట్ల వివరాలను తెలుసుకుందాం..

WTC Final 2023 Teamindia vs Australia : టెస్టు క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నీ వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌ షిప్‌(#WTC Final 2023). టెస్టు క్రికెట్‌కు తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు ఐసీసీ ప్రయోగాత్మకంగా 2019లో ఈ వరల్డ్​ టెస్టు ఛాంపియన్ షిప్‌ను ప్రారంభించింది. పాయింట్స్​ టేబుల్​లో టాప్‌-2 ఉన్న టీమ్స్​తో రెండేళ్లకోసారి ఫైనల్‌ నిర్వహిస్తోంది. అయితే ఫస్ట్ ఎడిషన్​లో భారత్-న్యూజిలాండ్‌ మధ్య జరగగా.. న్యూజిలాండ్ విజయం సాధించింది. గదను దక్కించుకుంది. అయిదే ఈ సారి తొమ్మిది టీమ్స్​ పోటీపడగా.. మరోసారి టీమ్​ఇండియా ఫైనల్​ చేరుకుంది. అలానే భారత్​తో తలపడేందుకు ఆస్ట్రేలియా ఈ తుదిపోరుకు అర్హత సాధించింది. మరి ఇంకో రోజులో ప్రారంభంకానున్న ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఎక్కడ జరగనుంది, ఆ టీమ్స్​ వివరాలు, విన్నర్​ ప్రైజ్‌మనీ ఎంత? వంటి వివరాలను తెలుసుకుందాం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మ్యాచ్‌ ఎక్కడ జరగనుంది.. జూన్ 07-11 మధ్య ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ జరగనుంది. జూన్‌ 12ను రిజర్వ్ డేగా అనౌన్స్ చేశారు. వర్షం లేదా ఇతర కారణాల వల్ల ఈ ఐదు రోజుల్లో ఎప్పుడైన ఆట నిర్వహణ కుదరకపోతే.. రిజర్వ్ డే మ్యాచ్‌ను కొనసాగిస్తారు. లండన్‌ ఓవల్‌ స్టేడియం(wtc final 2023 venue) వేదికగా ఈ ఫైనల్​ నిర్వహించనున్నారు.

ఎక్కడ చూడాలి.. భారత్​ క్రికెట్ ఫ్యాన్స్​ ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షప్రసారం ద్వారా చూడొచ్చు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ యాప్‌లోనూ లైవ్‌స్ట్రీమింగ్ అవుతుంది(wtc final 2023 ott platform). ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది.

WTC Final Prizemoney : ఈ వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు గదను అందిస్తారు. దీంతో పాటు ఆ జట్టుకు రూ.13 కోట్లు (1.6 మిలియన్‌ డాలర్లు) ప్రైజ్‌మనీ అందజేస్తారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.6.5 కోట్లు (8 లక్షల డాలర్లు) నగదు బహుమతి ఇస్తారు.

జట్ల వివరాలు..

WTC Final 2023 teamindia squad : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారా, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అజింక్య రహానె, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్‌, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్.

స్టాండ్‌బై ప్లేయర్స్​ : ముఖేశ్‌ కుమార్‌, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్‌ యాదవ్.

WTC Final 2023 australia squad : పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్‌ కెప్టెన్‌), అలెక్స్ కెరీ (వికెట్ కీపర్‌), జోష్ ఇంగ్లిస్ (వికెట్‌ కీపర్‌), స్కాట్ బోలాండ్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మార్కస్ హారిస్, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, టాడ్ మర్ఫీ, నాథన్ లైయన్, మిచెల్ స్టార్క్, మైఖేల్ నేసర్, డేవిడ్ వార్నర్.

స్టాండ్‌బై ప్లేయర్స్​ : మాట్‌ రెన్‌షా, మిచెల్ మార్ష్.

ఇదీ చూడండి : టీమ్ఇండియా WTC Final చేరుకోవడానికి కారణం వీళ్లే

సచిన్ రికార్డ్​పై రోహిత్ కన్ను.. టెస్టు క్రికెట్‌లో సిక్సర్ల కింగ్ ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.