ETV Bharat / sports

WTC Final 2023 : హెడ్​ సెంచరీతో పాటు తొలి రోజు నమోదైన రికార్డులివే!

author img

By

Published : Jun 8, 2023, 12:38 PM IST

WTC Final 2023 : హెడ్​ సెంచరీతో పాటు తొలి రోజు నమోదైన రికార్డులివే!
WTC Final 2023 : హెడ్​ సెంచరీతో పాటు తొలి రోజు నమోదైన రికార్డులివే!

WTC Final 2023 IND VS AUS : టీమ్​ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మొదటి రోజు పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే..

WTC Final 2023 IND VS AUS : టీమ్​ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మొదటి రోజు ఆటలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఆసీస్​ జట్టులో ఐదో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చిన ట్రావిస్‌ హెడ్‌ (156 బంతుల్లో 146*: 22x4, 1x6) మెరుపు ఇన్నింగ్స్​ ఆడి సెంచరీ నమోదు చేశాడు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో శతకం బాదిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

Travis head century : అయితా తాను శతకం బాది రికార్డులు నమోదు చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు ట్రావిస్ హెడ్​. "ఫస్ట్​ టాస్‌ ఓడినప్పటికీ.. ఆట పూర్తయ్యేసమయానికి ఆధిపత్యం సాధించాం. మొదట్లో కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత కుదురుకోవడంతో దూకుడుగా ఆడగలిగాను. బాగా ప్రాక్టీస్‌ చేయడం వల్లే ఈ ప్రదర్శన చేయగలిగాను. నా ఇన్నింగ్స్‌తో ఎంతో సంతృప్తిగా ఉన్నాను. మరో ఎండ్‌లో ఉండే బ్యాటర్​ మద్దతుగా ఉంటే స్వేచ్ఛగా ఆడొచ్చు. ఇప్పుడు స్టీవ్‌ స్మిత్ అందించిన సహకారం మర్చిపోలేనిది. అతడి బ్యాటింగ్‌ స్టైల్​ అంటే నాకు చాలా ఇష్టం. ఇకోపోతే పిచ్‌ కూడా మొదట్లో చాలా కఠినంగా అనిపించింది"అని ట్రావిస్ హెడ్ పేర్కొన్నాడు.

  • What a start!

    A brilliant unbeaten 146 by Travis Head, accompanied by Steve Smith on 95* has our Aussie men in a dominant position after day one of the #WTC23 Final 💪 pic.twitter.com/XFJRjka1z0

    — Cricket Australia (@CricketAus) June 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మొదటి రోజు రికార్డులు..

  • గత 57 టెస్టుల్లోనూ ఫస్ట్​ బౌలింగ్‌ ఎంచుకుని బరిలోకి దిగిన టీమ్​ఇండియా.. కేవలం 9 మ్యాచుల్లోనే విజయం సాధించింది. మరో 20 టెస్టుల్లో ఓటమిని అందుకుంది. 28 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
  • ట్రావిస్ హెడ్ ఈ సీజన్‌లోనే 81.91తో అత్యధిక బ్యాటింగ్‌ స్ట్రైక్‌రేట్‌ ఉన్న ఆటగాడిగా నిలిచాడు. తొలి స్థానంలో ఉన్న రిషభ్‌ పంత్ 80.81 స్ట్రైక్​రేట్​ను అధిగమించాడు.
  • స్టీవ్‌ స్మిత్ ఓ ఘనతను అందుకున్నాడు. ఇంగ్లాండ్‌ గడ్డపై పర్యాటక జట్టు బ్యాటర్స్​లో.. అత్యధిక టెస్టు పరుగులు చేసిన జాబితాలో 1822* పరుగులతో నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఫలితంగా గ్యారీఫీల్డ్‌ సోబెర్స్​ను(1820 పరుగులు) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్‌ (2674 పరుగులు) అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇకపోతే ఓవల్‌ స్టేడియంలో స్మిత్ మొత్తంగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో 486 పరుగులను చేశాడు.
  • స్మిత్-హెడ్ కలిసి నాలుగో వికెట్​కు 251 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా తరఫున ఇంగ్లాండ్‌లో నాలుగో వికెట్‌కు ఇది రెండో అత్యధిక పరుగుల భాగస్వామ్యం. అంతకుముందు 1934లో డాన్‌ బ్రాడ్‌మన్ - బిల్‌ పోన్స్‌ఫోర్డ్‌ జోడీ.. ఇంగ్లాండ్‌పై 388 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
  • టీమ్​ఇండియాపై ఆస్ట్రేలియాకు ఏ వికెట్‌కైనా నాలుగో అత్యధిక భాగస్వామ్యం ఇదే. 2012లో అడిలైడ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టుపై పాంటింగ్ - మైకెల్ క్లార్క్‌ కలిసి 386 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
  • డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్​లో హెడ్-స్మిత్‌ కలిసి ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్‌ల్లో 99.28 యావరేజ్​తో 695 పరుగులు నెలకొల్పారు.

ఇదీ చూడండి :

2001 టెస్ట్​ మ్యాజిక్​ రిపీట్​ అవుతుందా?.. అప్పుడు కూడా సేమ్​ సీన్​!

WTC Final AUS vs IND : ఫస్ట్​ డే హైలైట్​ ఫొటోస్​ మీకోసం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.