ETV Bharat / sports

మహిళల ప్రీమియర్​ లీగ్​.. RCB కెప్టెన్​గా 'లక్కీ గర్ల్'​ స్మృతి.. కోహ్లీ బెస్ట్​ విషెస్​..

author img

By

Published : Feb 18, 2023, 11:55 AM IST

wpl 2023 smriti mandhana virat kohli
wpl 2023 smriti mandhana virat kohli

ఇటీవల జరిగిన మహిళల ప్రీమియర్​ లీగ్​ వేలంలో అత్యధిక ధర పలికిన స్మృతి మంధానను కెప్టెన్​గా ఆర్​సీబీ నియమించింది. ఈ మేరకు సోషల్​ మీడియా వేదికగా ఐపీఎల్​ పురుషుల ఆర్​సీబీ జట్టు కెప్టెన్​ డుప్లెసిస్​ ప్రకటించారు. ఆమెకు ఆల్​ ది బెస్ట్​ తెలిపారు.

WPL 2023 RCB Captain: మహిళల ప్రీమియర్​ లీగ్​ తొలి ఎడిషన్​ వేలంలో టీమ్​ఇండియా ప్లేయర్ స్మృతి మంధానను రికార్డు స్థాయిలో రూ.3.4 కోట్లకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు దక్కించుకుంది. ఇప్పుడు ఈ క్రికెట్​ బ్యాటీనే ఆ ఫ్రాంచైజీ.. జట్టు కెప్టెన్​గా నియమించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జట్టు యాజమాన్యం ప్రకటించింది.

"ఒక నంబర్ 18 నుంచి మరొకరు.. ఒక కెప్టెన్​ నుంచి మరొకరు.. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్​ డబ్ల్యూపీఎల్​ ఆర్​సీబీ కెప్టెన్​గా స్మృతి మంధానను ప్రకటించారు​" అని యాజమాన్యం ఓ వీడియో పోస్టు చేసింది. ఆ వీడియోలో ఐపీఎల్​ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్​ ఫాప్​ డుప్లెసిస్​ తమ అనుభవాల గురించి మాట్లాడారు. స్మృతి మంధానను కెప్టెన్​గా ప్రకటించారు. అనంతరం ఆమెను కెప్టెన్స్ క్లబ్​కు పరిచయం చేశారు. కాగా, ఐపీల్​లో విరాట్​ కోహ్లీ జర్సీ నెంబర్​ 18. ఇప్పుడు డబ్ల్యూపీఎల్​లో మహిళల జట్టుకు సారథ్యం వహించబోతున్న స్మృతి మంధాన జెర్సీ నంబర్​ కూడా 18 కావడం గమనార్హం.

100 శాతం ప్రయత్నిస్తాను: స్మృతి మంధాన
"హాయ్​.. నేను స్మృతి మంధాన. నేను మహిళల ప్రీమియర్​ లీగ్​లో ఆర్​సీబీ జట్టుకు కెప్టెన్​. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్​ ఆర్​సీబీకి సారథ్యం వహించడం గురించి చెప్పిన విషయాలు చూసి చాలా గ్రేట్​ ఫీలింగ్​ కలిగింది. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన ఆర్​సీబీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఫ్యాన్స్​ అందరూ మీ ప్రేమాభిమానాలను నాపై ఇలాగే చూపిస్తారని ఆశిస్తున్నాను. ఆర్​సీబీని విజయ తీరాలకు నడిపించడానికి 100 శాతం కృషి చేస్తాను" అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.

బెంగళరూరు జట్టు మాజీ సారధి విరాట్​ కోహ్లీ కూడా మాట్లాడాడు. ఆర్​సీబీకి 10 ఏళ్లు సారథ్యం వహించడం తన జీవితంలో మరిచిపోలేని ఒక ఫేజ్​ అని అన్నాడు. కెప్టెన్​ అంటే గ్రూప్​నకు లీడర్ మాత్రమే కాదని.. అందరి రెస్పెక్ట్​ను పొంది.. లిగసీని ముందుకు తీసుకెళ్తాడని చెప్పాడు. గతేడాది కెప్టెన్​గా డుప్లెసిస్ జట్టును అద్భతంగా నడిపంచాడని కొనియాడాడు. అనంతరం ఆర్​సీబీ కెప్టెన్​గా మంధానను ప్రకటించాడు. 'నీకు బెస్ట్​ టీమ్​, బెస్ట్​ ఫ్యాన్స్​ సపోర్టుగా ఉన్నారు' అని చెప్పాడు. అనంతరం డుప్లెసిస్​ మాట్లాడి మంధానకు ఆల్​ది బెస్ట్ చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.