ETV Bharat / sports

మహిళల ఐపీఎల్​కు టైమ్​ ఫిక్స్​.. ఎప్పుడంటే?

author img

By

Published : Aug 13, 2022, 6:42 AM IST

women IPL
మహిళల ఐపీఎల్​

Womens IPL: పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో నెల రోజుల పాటు ఐదు జట్లతో మహిళల ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.

ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న మహిళల భారతక్రికెట్‌ లీగ్‌ వచ్చే సీజన్‌ నుంచే కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళల క్రికెట్‌కు గత కొన్నేళ్లలో ఆదరణ ఎంతో పెరిగిన నేపథ్యంలో వాళ్లకూ భారత క్రికెట్‌ లీగ్‌ నిర్వహిస్తే అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుందని, భారత జట్టుకు కూడా అది మేలు చేస్తుందనే అభిప్రాయాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. పురుషుల భారత క్రికెట్‌ లీగ్‌ సందర్భంగా నిర్వహించే మహిళల టీ20 ఛాలెంజ్‌ బాగానే అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుండడంతో వారికి పూర్తి స్థాయి భారతక్రికెట్‌ లీగ్‌ నిర్వహించాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా ఈ విషయమై సానుకూలంగా స్పందించారు.

ఇప్పుడు బీసీసీఐ ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. వచ్చే సీజన్లో భారత క్రికెట్‌ లీగ్‌ నిర్వహించేందుకు గాను మహిళల సీజన్‌లో మార్పులు చేసింది. సాధారణంగా భారత మహిళల సీజన్‌ నవంబరుతో మొదలై ఏప్రిల్‌ వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది అక్టోబరులో మొదలు పెట్టి ఫిబ్రవరికే సీజన్‌ను ముగించబోతున్నారు. పురుషుల భారతక్రికెట్‌ లీగ్‌ కంటే ముందే ముగిసేలా ఆరు జట్లతో 2023లో మహిళల లీగ్‌ను ఆరంభించే ఉద్దేశంతోనే ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. మహిళల భారత క్రికెట్‌ లీగ్‌లో జట్లను దక్కించుకోవడానికి ప్రస్తుత పురుషుల భారత క్రికెట్‌ లీగ్‌ ఫ్రాంఛైజీలే చాలా వరకు ఆసక్తితో ఉన్నాయి. కొత్త ఫ్రాంఛైజీలు కూడా రేసులోకి వచ్చే అవకాశముంది. త్వరలోనే మహిళల భారతక్రికెట్‌ లీగ్‌ గురించి అధికారిక ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక బీసీసీఐ అధికారి ఈ లీగ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘అవును.. మహిళల భారత క్రికెట్‌ లీగ్‌ వచ్చే ఏడాది మార్చి తొలి వారంలో మొదలవుతుంది. తొలి సీజన్‌ నాలుగు వారాల పాటు సాగుతుంది. దక్షిణాఫ్రికాలో ఫిబ్రవరి 26న మహిళల టీ20 ప్రపంచకప్‌ పూర్తయిన కొన్ని రోజులకే ఈ టోర్నీ మొదలవుతుంది. 5 లేదా 6 జట్లతో ఈ లీగ్‌ జరగొచ్చు. త్వరలోనే జట్ల వేలం ప్రక్రియ గురించి ప్రకటన రావచ్చు’’ అని తెలిపాడు.

ఇదీ చూడండి: పంత్​ గర్ల్​ఫ్రెండ్ దూకుడు మామూలుగా లేదుగా.. అందాల ఆరబోతతో రచ్చ రచ్చ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.