ETV Bharat / sports

హోమ్​ మ్యాచెస్​కు టీమ్ఇండియా రెడీ.. హైదరాబాద్‌, వైజాగ్​లోనూ..

author img

By

Published : Jul 26, 2023, 9:58 AM IST

Updated : Jul 26, 2023, 10:06 AM IST

teamindia
teamindia bcci schedule

Team India home season schedule: భారత క్రికెట్‌ జట్టు సెప్టెంబరు నుంచి ఆరు నెలల వ్యవధిలో సొంతగడ్డపై ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ఖరారు చేసింది. ఆ షెడ్యూల్​ మీ కోసం..

BCCI Schedule : సెప్టెంబరు నుంచి ఆరు నెలల వ్యవధిలో సొంతగడ్డపై టీమ్​ఇండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ హోమ్ సీజన్​లో భాగంగా టీమ్​ఇండియా మొత్తం 16 మ్యాచ్ లు ఆడనుంది. ఈ క్రమంలో భారత్‌ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌లో ప్రాధాన్యం దక్కని నగరాలకు పెద్ద పీట వేస్తూ మ్యాచ్‌లను ఖరారు చేసింది.అందులో వైజాగ్‌కు, హైదరాబాద్‌కు రెండేసి మ్యాచ్‌లను బీసీసీఐ కేటాయించింది.

ఆస్ట్రేలియాతో వన్డేలు.. ఇంగ్లాండ్​తో టెస్టులు
ఇక అక్టోబరులో ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా.. దానికి ముందు ఆడే చివరి వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాను టీమ్‌ఇండియా ఢీకొనబోతోంది. సెప్టెంబరు 22, 24, 27 తేదీల్లో జరిగే ఈ మ్యాచ్‌లకు మొహాలి, ఇందౌర్‌, రాజ్‌కోట్‌ ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ప్రపంచకప్‌ ముగిశాక ఆసీస్‌తోనే భారత జట్టు అయిదు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఈ క్రమంలో నవంబరు 23న తొలి మ్యాచ్‌కు విశాఖపట్నం, డిసెంబరు 3న చివరి టీ20కి హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తాయి.

మరోవైపు నవంబరు 26, 28, డిసెంబరు 1 తేదీల్లో మిగతా టీ20లు తిరువనంతపురం, గువాహటి, నాగ్‌పుర్‌ల వేదికగా జరుగుతాయి. దీని తర్వాత అఫ్గానిస్థాన్‌తో జనవరి 11, 14, 17 తేదీల్లో భారత్‌ ఆడే మూడు టీ20ల సిరీస్‌కు బెంగళూరు, మొహాలి, ఇందౌర్‌ ఆతిథ్యమిస్తాయి. అదే నెల చివర్లో ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ మొదలవుతుంది. జనవరి 25-29 తేదీల్లో తొలి టెస్టు హైదరాబాద్‌లో, ఫిబ్రవరి 2-6 మధ్య రెండో టెస్టు వైజాగ్​లో జరుగుతాయి. తర్వాతి మూడు టెస్టులకు రాంచి, రాజ్‌కోట్‌, ధర్మశాల వేదికలుగా ఖరారయ్యాయి.

ఇంగ్లండ్‌ ఐదు టెస్ట్‌ల షెడ్యూల్
తొలి టెస్ట్ - జనవరి 25 నుంచి 29 (హైదరాబాద్)

రెండో టెస్ట్ - ఫిబ్రవరి 2 నుంచి 6 (వైజాగ్)

మూడో టెస్ట్ - ఫిబ్రవరి 16 నుంచి 20 (రాజ్‌కోట్)

నాలుగో టెస్ట్ - ఫిబ్రవరి 23 నుంచి 27 (రాంచీ)

ఐదో టెస్ట్ - మార్చి 7 నుంచి 11 (ధర్మశాల)

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ షెడ్యూల్

తొలి వన్డే - సెప్టెంబర్ 22 (మొహాలీ)

రెండో వన్డే - సెప్టెంబర్ 24 (ఇండోర్)

మూడో వన్డే - సెప్టెంబర్ 27 (రాజ్‌కోట్)

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ షెడ్యూల్
తొలి టీ20 - నవంబర్ 23 (వైజాగ్)

రెండో టీ20 - నవంబర్ 26 (తిరువనంతపురం)

మూడో టీ20 - నవంబర్ 28 (గువాహటి)

నాలుగో టీ20 - డిసెంబర్ 1 (నాగ్‌పూర్)

ఐదో టీ20 - డిసెంబర్ 3 (హైదరాబాద్)

Last Updated :Jul 26, 2023, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.