ETV Bharat / sports

'మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం.. సంజూ ఈజ్​ గ్రేట్‌!'

author img

By

Published : Oct 7, 2022, 10:52 AM IST

Etv Bharat
Etv Bharat

డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడంలో విఫలం కావడమే జట్టు ఓటమికి దారితీసిందని భారత క్రికెట్​ జట్టు తాత్కాలిక కెప్టెన్​ శిఖర్​ ధావన్‌ తెలిపాడు. గురువారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా.. తొమ్మిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్​లో బ్యాటర్​ సంజూ శాంసన్ మాత్రం సూపర్​ ఇన్నింగ్స్​తో​ అదరగొట్టాడు.

లఖ్​నవూ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమ్​ఇండియా..9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం భారత క్రికెట్​ జట్టు తాత్కాలిక కెప్టెన్‌ శిఖర్ ధావన్ స్పందించాడు. డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడంలో విఫలం కావడమే జట్టు ఓటమికి దారితీసిందని ధావన్‌ తెలిపాడు.

"40 ఓవర్లకు 250 పరుగులు చిన్న లక్ష్యమేమి కాదు. స్వింగ్‌, స్పిన్‌ అయ్యే వికెట్‌పై మేము చాలా పరుగులు ఇచ్చాము. ఫీల్డింగ్‌లో కూడా అంతగా రాణించలేకపోయాం. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాము. ఇక బ్యాటింగ్‌లో కూడా ఆరంభం మంచిగా లేదు. కానీ సంజూ ఆడిన ఇన్నింగ్స్‌ మాత్రం అద్భుతమైనది. ఆఖర్లో శార్దూల్​, సంజూ జట్టును గెలిపిస్తారని భావించాము. ఈ మ్యాచ్‌ నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మా తదుపరి మ్యాచ్‌లో ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా చూస్తాం" అని పేర్కొన్నాడు.

కాగా, మ్యాచ్​ ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన భారత బౌలర్లు ఆఖరి ఓవర్లలో మాత్రం తేలిపోయారు. ప్రోటీస్‌ బ్యాటర్లు క్లసన్‌, మిల్లర్‌ బౌండరీల వర్షం కురిపించారు. ఖరి 5 ఓవర్లలో టీమ్​ఇండియా బౌలర్లు ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నారు. అదే విధంగా ఫీల్డింగ్‌లో కూడా భారత్‌ పేలవ ప్రదర్శన కనబరిచింది. మిల్లర్‌, క్లసన్‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారివిడిచారు. ఇందుకు భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఇక బ్యాటింగ్‌లో కూడా టీమ్​ఇండియా అంతగా రాణించలేకపోయింది. ధావన్‌, గిల్‌, కిషన్‌, గైక్వాడ్‌ తీవ్రంగా నిరాశపరిచారు. అయితే సంజూ శాంసన్‌ మాత్రం అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న సంజూ 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూ శాంసన్​ బ్యాటింగ్​ పట్ల పలువురు మాజీలు ప్రశంసలు కురిపించారు.

ఇవీ చదవండి: 'ఆ ఇద్దరికి వరల్డ్ కప్​ టీమ్​లో చోటు దక్కకపోవడమా?.. చాలా ఆశ్చర్యంగా ఉంది!'

'ఈ నాటి ఈ బంధం ఏ నాటిదో..' పాక్ మాజీ కెప్టెన్​ను కలిసిన టీమ్​ఇండియా దిగ్గజం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.