ETV Bharat / sports

ODI WorldCup 2023 Semi Final Race : సగం మ్యాచులు పూర్తి.. సెమీస్​ వెళ్లే జట్లు ఇవేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 12:12 PM IST

ODI WorldCup 2023 Semi Final Race : సగం మ్యాచులు పూర్తి.. సెమీస్​ వెళ్లే జట్లు ఇవేనా?
ODI WorldCup 2023 Semi Final Race : సగం మ్యాచులు పూర్తి.. సెమీస్​ వెళ్లే జట్లు ఇవేనా?

ODI WorldCup 2023 Semi Final Race : వన్డే ప్రపంచకప్‌ దాదాపు సగం పూర్తయింది. దీంతో సెమీ ఫైనల్స్‌కు వెళ్లే జట్లు ఏవి అనే ప్రశ్న మొదలైంది. దానికి సమాధానమే ఈ కథనం.

ODI WorldCup 2023 Semi Final Race : ప్రపంచ కప్​ 2023 రసవత్తరంగా సాగుతోంది. దాదాపుగా సగం మ్యాచులు పూర్తైపోయాయి. అప్పుడే సెమీస్​ రేసు గురించి చర్చ మొదలైపోయింది. అందరి నోట దీని గురించే ప్రశ్నలు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమ్​ఇండియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా... టాప్‌-4లో ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే.. ఈ నాలుగింటికే సెమీస్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ, ఇప్పుడు వరల్డ్​ కప్​ 2023 రోజురోజుకి సంచలన విజయాలు ఎదురౌతున్నాయి. ఇప్పటికే మూడు సంచలన విజయాలు నమోదయ్యాయి. దీంతో టాప్‌ 4 స్థానాలను అంత సులువుగా నిర్ణయించే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు.

టాప్‌ 1లో ఉన్న టీమ్​ఇండియా.. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచి 10 పాయింట్లు, 1.353 నెట్‌ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఇంగ్లాండ్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో పోటీపడనుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ చూస్తుంటే ఈ జట్లపై జరగనున్న మ్యాచుల్లో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని పిస్తోంది. ఏదైనా ఓ సంచలన విజయం నమోదు అయితేనే తప్ప భారత్‌ అగ్ర స్థానం నుంచి కిందకు పడే అవకాశం లేదు. అలానే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ జట్టులో భీకరమైన బ్యాటింగ్‌ లైనప్​ ఉంది కాబట్టి.. అక్కడ విజయం సాధిస్తేనే భారత్‌ స్థానాన్ని డిసైడ్ అవుతుంది.

రెండూ, మూడు ఎవరంటే.. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచి ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉంది దక్షిణాఫ్రికా. ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్​పై భారీ విజయాలు అందుకుని రన్‌రేట్‌ (2.370) అందరి కన్నా ఎక్కువగా ఉంది. ఈ జోరు ఇలానే కొనసాగిస్తే ఆ జట్టు సెమీస్‌ బెర్త్‌ ఖాయమనే చెప్పాలి. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్​తో ఆడనుంది. ఇవి కఠినమైన జట్లే. ఈ మూడింటిలో ఏమైనా తేడా కొడితే.. నెట్‌రన్‌రేట్‌ ఆ జట్టును కాపాడుతుంది.

ఇక సౌతాఫ్రికాలానే ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించిన న్యూజిలాండ్‌ మూడో స్థానంలో ఉంది. టీమ్​ఇండియాపై ఓడిన న్యూజిలాండ్‌.. టోర్నీలో ప్రస్తుతం నిలకడగా రాణిస్తోంది. ఈ జట్టు మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, శ్రీలంకతో పోటీపడనుంది. మరి న్యూజిలాండ్ ప్రస్తుత ఫామ్‌ చూస్తే నాలుగు మ్యాచుల్లోనూ విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అనిపిస్తోంది. కానీ ప్రస్తుతం నమోదు అవుతున్న సంచలన విజయాలతో ఏం జరుగుతుందో చెప్పలేం. ఇప్పటికే ఈ టోర్నీలో మూడు పెద్ద జట్లకు షాకులు తగిలిన సంగతి తెలిసిందే.

నాలుగులో ఎవరు?.. మూడు స్థానాలు గురించి దాదాపుగా ఓ క్లారిటీ ఉన్నా.. నాలుగు స్థానం కోసం గట్టి పోటీ కనిపిస్తోంది. నాలుగేసి పాయింట్లతో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ తర్వాతి స్థానాలో ఉన్నాయి. అయితే పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​ కన్నా ఓ మ్యాచ్‌ తక్కువగా ఆడటం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం. ఈ జట్టు తర్వాతి మ్యాచుల్లో నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో పోటీపడనుంది. ఇందులో కనీసం మూడింట విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ లెక్కన 10 పాయింట్లతో టాప్‌ 4లో కొనసాగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

ఫైనల్​గా టాప్‌-4లో ఉన్న జట్లు.. ఇకపై ఆడే మ్యూచుల్లో తడబడితే మాత్రం ఆ అవకాశాన్ని పాకిస్థాన్‌ చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ, వరుస ఓటములతో ప్రస్తుతానికి ఆ జట్టు డీలాపడిపోయింది. దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ తర్వాత ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ ప్రస్తుతం మూడు భారీ పరాజయాలతో రన్‌ రేట్‌ పరంగా చాలా వెనకపడి ఉంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఇది పైకి వస్తుందని చెప్పలేం.

ODI World Cup 2023 : బంతి పడితే వికెట్లు కూలాల్సిందే.. ప్రపంచకప్​లో అద్భుతం చేస్తున్న 23ఏళ్ల కుర్రాడు!

ODI World Cup 2023 England : డిఫెండింగ్​ ఛాంపియన్​కు ఏమైంది?.. పేలవ ప్రదర్శనకు ఇదే ప్రధాన కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.