ETV Bharat / sports

IND VS ENG: భారత్​తో తొలి టెస్టుకు ఆర్చర్​ కష్టమే!

author img

By

Published : May 27, 2021, 5:49 PM IST

Jofra Archer might miss first Test against India
ఆర్చర్​

ఆగస్టులో భారత​ జట్టుతో జరిగే తొలి టెస్టులో ఇంగ్లీష్ క్రికెటర్ ఆర్చర్ ఆడటం కష్టమేనని తెలుస్తోంది. ఇటీవల అతడికి శస్త్రచికిత్స జరిగింది.

ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ ఆర్చర్.. టీమ్​ఇండియాతో టెస్టు సిరీస్​లో ఆడేది అనుమానంగా కనిపిస్తోంది. మోచేతి గాయానికి మరోసారి శస్త్రచికిత్స చేయించుకున్న కారణంగా కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోనున్నాడు. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్​, యాషెస్ టెస్టు సిరీస్​పై దృష్టి సారించేందుకే ఆర్చర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది మార్చిలో భారత్​తో టీ20 సిరీస్​ సందర్భంగా ఆర్చర్ గాయపడ్డాడు. ఆ తర్వాత ఐపీఎల్​లోనూ ఆడలేకపోయాడు. ప్రస్తుతం అతడికి సర్జరీ జరగడం వల్ల త్వరలో కోలుకునే అవకాశముంది.

ఇది చదవండి: ఆర్చర్​కు మళ్లీ సర్జరీ.. ఆటకు 4 వారాలు దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.