ETV Bharat / sports

ఇషాన్ భారీ తప్పిదం - మ్యాచ్​లో టర్నింగ్ పాయింట్ ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 6:45 AM IST

Updated : Nov 29, 2023, 7:49 AM IST

Ishan Kishan Stumping
Ishan Kishan Stumping

Ishan Kishan Stumping : ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత్.. 5 వికెట్ల తేడాతో ఓడింది. చివరి వరకు టీమ్ఇండియా చేతుల్లోనే ఉన్న మ్యాచ్.. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తప్పిదం వల్ల చేజారింది.

Ishan Kishan Stumping : టీమ్ఇండియా జోరుకు బ్రేక్ పడింది. మూడో టీ20లో భారత బౌలర్లు తేలిపోయారు. ఆస్ట్రేలియా సిరీస్​లో సజీవంగా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో సత్తా చాటింది. బ్యాటింగ్​కు అనుకూలిస్తున్న పిచ్​పై ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ చెలరేగిన వేళ ప్రత్యర్థి జట్టు.. సిరీస్​లో తొలి విజయం నమోదు చేసింది. అయితే చివరి ఓవర్​ దాకా టీమ్ఇండియా చేతుల్లో ఉన్న మ్యాచ్​.. ఇషాన్ కిషన్ తప్పిదం వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఆసీస్ ఓ దశలో 9 బంతుల్లో 33 పరుగులు చేయాలి. ఆ ఓవర్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తున్నాడు. 19.4వ బంతిని మాథ్యూ వేడ్‌.. క్రీజును వదిలి ముందుకు వచ్చి ఆడబోయాడు. కానీ, బ్యాట్​ను మిస్​ అయిన బంతి.. ఇషాన్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఇషాన్.. స్టంపింగ్‌ చేసి అప్పీల్‌ చేశాడు. రిప్లేలో ఫలితం నాటౌట్‌గా తేలింది. అయితే బంతిని అందుకునే క్రమంలో ఇషాన్ గ్లోవ్స్ స్టంప్స్‌ కన్నా ముందుకు వచ్చాయి.

దీంతో అంపైర్ ఈ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. వచ్చిన ఛాన్స్​ను దొరకబుచ్చుకున్న వేడ్.. ఫ్రీహిట్​ను సిక్స్​గా మలిచాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. బౌలర్ వేసిన బంతిని, వికెట్ కీపర్ స్టంప్స్​ వెనకాలే అందుకోవాలి. గ్లవ్స్ ఏ మాత్రం ముందుకు వచ్చినా.. దాన్ని అంపైర్‌ నోబాల్‌గా డిక్లేర్​ చేయవచ్చు. అయితే ఇషాన్ ఈ స్టంపింగ్ అప్పీల్ చేయకపోతే.. ఆసీస్​కు ఫ్రీ హిట్ వచ్చేది కాదు. ఇక 20వ ఓవర్లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. కెప్టెన్ సూర్యకుమార్, ప్రసిద్ధ్ కృష్ణకు బంతినిచ్చాడు. ఈ ఓవర్లో ప్రసిద్ధ్ వరుసగా 4,1,6,4,4,4 సమర్పించుకున్నాడు. దీంతో ఆసీస్ విజయం ఖరారైంది.

మ్యాక్స్ అదరహొ.. 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ బ్యాటర్ మ్యాక్స్​వెల్ (104 నాటౌట్‌, 48 బంతుల్లో 8×4, 8×6) శతకంతో అదరగొట్టాడు. బౌండరీలే లక్ష్యంగామ్యాక్స్ దుమ్మురేపాడు. అతడు సాధించిన 104 స్కోర్​లో​ 80 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. అతడి విధ్వంసంతో ఆసీస్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక భారత బౌలర్ ప్రసిద్ధ్.. 4 ఓవర్లలో వికెట్ లేకుండా 68 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.

రుతురాజ్​ సెంచరీ వృథా మూడో టీ20లో ఆసీస్​ గెలుపు

సిరీస్​పై టీమ్ఇండియా గురి - ఆసీస్ పరువు దక్కించుకునేనా!

Last Updated :Nov 29, 2023, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.