ETV Bharat / sports

డకౌట్​ అయినా కోహ్లీ సెంచరీ నమోదు!.. అనుష్కకు స్పెషల్​ కిస్​​ ఇస్తూ..

author img

By

Published : Apr 24, 2023, 1:53 PM IST

virat kohli another milestone
virat kohli another milestone

రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో డకౌట్ అయిన రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్​​ విరాట్​ కోహ్లీ.. అరుదైన ఘనత అందుకున్నాడు. అదేంటంటే?

భారత స్టార్​ బ్యాటర్​ విరాట్ కోహ్లీకి ఏప్రిల్​ 23తో ఉన్న సెంటిమెంట్​ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆర్​ఆర్​తో జరిగిన మ్యాచ్​లోనూ బ్యాటర్​గా విఫలమయ్యాడు. ఇన్నింగ్స్​లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్​గా వెనుదిరిగాడు. బౌల్ట్​ వేసిన బంతిని అంచనా వేయలేక వికెట్ల ముందు దొరికిపోయాడు. కానీ ఇదే మ్యాచ్​లో తన పేరిట మరో రికార్డు సొంతం చేసుకున్నాడు విరాట్​. ఐపీఎల్‌లో వందకుపైగా క్యాచ్‌లను అందుకున్న మూడో ఫీల్డర్​గా రికార్డు సృష్టించాడు. విల్లే బౌలింగ్​లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఇచ్చిన క్యాచ్​ను విరాట్​ అందుకున్నాడు. దీంతో ఐపీఎల్​ చరిత్రలో 100 క్యాచ్​లను అందుకున్న ప్లేయర్ల జాబితాలో చేరాడు.

అయితే విరాట్​ కంటే ముందు సురేశ్​ రైనా, కీరన్​ పోలార్డ్​ ఈ ఫీట్​ సాధించారు. రైనా 205 మ్యాచ్​ల్లో 109 క్యాచ్​లతో మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత వెస్టిండీస్​ స్టార్​ ప్లేయర్​ కీరన్​ పోలార్డ్​ 189 మ్యాచ్‌ల్లో 103 క్యాచ్‌లు పట్టాడు. వీరిద్దరి తర్వాత ఐపీఎల్‌లో వందకుపైగా క్యాచ్‌లను అందుకున్న మూడో ఫీల్డర్​గా కోహ్లీ నిలిచాడు. రోహిత్​ శర్మ 98, శిఖర్‌ ధవన్‌ 93 క్యాచ్‌లతో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

గాలిలో భార్య అనుష్కకు ముద్దిస్తూ...
ఐపీఎల్​తో పాటు టీమ్​ఇండియా మ్యాచ్​లకు హాజరవుతుంటారు విరాట్​ సతీమణి అనుష్క శర్మ. ఆదివారం రాజస్థాన్​తో మ్యాచ్​లో కూడా చిన్నస్వామి స్టేడియంలో అనుష్క సందడి చేశారు. ఛేదనలో బెంగళూరు బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ​యశస్వి జైస్వాల్(47), దేవదుత్‌ పడిక్కల్ (52) రాజస్థాన్​ను విజయం వైపు నడిపించారు. ఈ క్రమంలో హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో యశస్వి ఇచ్చిన క్యాచ్​ను విరాట్ బౌండరీ లైన్‌ వద్ద అందుకున్నాడు. అనంతరం గ్యాలరీలో నుంచి మ్యాచ్​ను వీక్షిస్తున్న తన భార్య అనుష్క వైపు చూస్తూ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది. అనుష్క కూడా నవ్వులు చిందిస్తూ ఆర్​సీబీ జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరిచింది. కాగా ఈ మ్యాచ్​లో ఆర్​సీబీ ఏడు పరుగుల తేడాతో గెలిచింది.

ముందునుంచి అనుకున్నట్లే
విరాట్‌కు ఏప్రిల్ 23వ తేదీ అంతగా అచ్చొచ్చినట్లు లేదు. ఇంతకు ముందు ఇదే తేదీన ఆడిన రెండు మ్యాచ్​ల్లో కోహ్లీ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 2017లో కోల్‌కతాతో, 2022 సీజన్​లో హైదరాబాద్​ మీద కూడా విరాట్​ డకౌటయ్యాడు. 2017లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్​లో బెంగళూరు జట్టు కేవలం 49 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 9 పరుగులు చేసిన జాదవ్​యే ఆ మ్యాచ్​లో టార్​ స్కోరర్​.

100 వికెట్ల క్లబ్​లో ట్రెంట్‌ బౌల్ట్‌...
కివీస్​ ఆటగాడు ట్రెంట్​ బౌల్డ్​.. విరాట్​ వికెట్​తో ఐపీఎల్​లో వంద వికెట్ల క్లబ్​లో చేరాడు. 84 మ్యాచ్‌ల్లో అతడు ఈ ఘనత అందుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.