ETV Bharat / sports

IPL 2021News: 'ఆర్సీబీలో ఏదో సమస్య ఉంది'

author img

By

Published : Sep 25, 2021, 6:15 PM IST

RCB, kevin pietersen
కెవిన్ పీటర్సన్

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టులో ఏదో సమస్య ఉందని ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్(Kohli Pietersen) అభిప్రాయపడ్డాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్​లో కోహ్లీసేన ఓటమిపాలైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

విరాట్‌ కోహ్లీ(Kohli Pietersen) సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో ఏదో సమస్య ఉందని, లేకపోతే ఇలా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అంత మంచి ఆరంభం దక్కినా ఓటమిపాలవ్వడం సరికాదని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌( Kevin Pietersen News) విశ్లేషించాడు. శుక్రవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో(CSK vs RCB 2021) తలపడిన మ్యాచ్‌లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన నేపథ్యంలో పీటర్సన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

"కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైన జట్టు చెన్నైతో మొదట మెరుగైన స్థితిలో నిలిచినా చివరికి ఓటమిపాలైంది. అంటే ఈ జట్టులో ఏదో సమస్య ఉంది. 111 పరుగుల వరకూ ఒక్క వికెట్‌ కోల్పోని జట్టు తర్వాత మ్యాచ్‌నే కోల్పోయింది. అందులో ఏదో ఇబ్బంది ఉంది. అదేంటో తెలుసుకొని త్వరగా పుంజుకోవాలి. మరోవైపు బౌలింగ్‌లోనూ బెంగళూరు సతమతమవుతోంది. మనమెప్పుడూ ఆ జట్టులో వికెట్లు తీసే బౌలర్‌ ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాం. చాహల్‌ వికెట్లు తీస్తున్నా ప్రతిసారీ అతడి నుంచే ఆశించడం సరికాదు. ఎవరైనా ఒకరు తోడుగా ఉండాలి. ముఖ్యంగా పేస్‌ బౌలింగ్‌ నుంచి సహకారం లభించాలి"

-కెవిన్ పీటర్సన్‌, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 156/6 స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు కోహ్లీ (53), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (70) దంచికొట్టి తొలి వికెట్‌కు 111 పరుగులు జోడించారు. దీంతో ఆ జట్టు విజయానికి కావాల్సిన అద్భుతమైన బాట వేశారు. అయితే, బ్రావో 14వ ఓవర్‌లో కోహ్లీని ఔట్‌ చేయగా.. శార్దూల్‌ 17వ ఓవర్‌లో డివిలియర్స్‌(12), దేవ్‌దత్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌ పంపాడు. చివర్లో మ్యాక్స్​వెల్(11)తో సహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమై చెన్నై ముందు మోస్తరు లక్ష్యం నిర్దేశించారు. అనంతరం చెన్నై బ్యాట్స్‌మెన్‌ రుతురాజ్‌ (38), డుప్లెసిస్‌(31), మొయిన్‌ అలీ(23), అంబటి రాయుడు (32), రైనా (17*), ధోనీ(11*) తలా కొన్ని పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో ధోనీసేన పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది.

ఇదీ చదవండి:

Dhoni vs Kohli: ధోనీ-కోహ్లీ.. ఇదే చివరిసారి!

'ఆ క్యాచ్​ ఇచ్చినందుకు మిస్బాకు థ్యాంక్స్ చెప్పాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.