ETV Bharat / sports

ఇకపై అలా చేస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా.. బౌలర్లకు మహీ సీరియస్ వార్నింగ్​

author img

By

Published : Apr 4, 2023, 10:40 AM IST

Updated : Apr 4, 2023, 10:52 AM IST

Dhoni warns bowlers to bowlers
ఇకపై అలా చేస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా.. బౌలర్లకు మహీ సీరియస్ వార్నింగ్​

బౌలర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు సీఎస్కే కెప్టెన్ ధోనీ. ఇకపై మంచి ప్రదర్శన చేయకపోతే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. తమ బౌలర్లను గట్టిగా హెచ్చరించాడు. తరచుగా ఎక్స్‌ట్రా‌లు ఎక్కువగా ఇస్తుండటం వల్ల వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. గత రాత్రి(ఏప్రిల్​ 3) చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా లఖ్​నవూతో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో సీఎస్కే విజయాన్ని సాధించింది. అయితే ఈ విజయం.. బ్యాటర్ల భారీ స్కోరు చేయడంతో దక్కింది. బౌలర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో బౌలర్ల ప్రదర్శనపై మహీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నాడు. నోబాల్స్, వైడ్స్ తక్కువగా వేసేందుకు ప్రయత్నించాలని.. లేదంటే ఇకపై కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో ఆడాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాడు. కాగా, లఖ్‌నవూ సూపర్​ జెయింట్స్​తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్లు మొత్తం 18 ఎక్స్‌ట్రాలు వేశారు. ఇందులో రెండు లెగ్‌బైస్‌, 13 వైడ్లు, మూడు నోబాల్స్‌ ఉన్నాయి. వీరిలో బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండే మూడు నోబాల్స్‌ వేశాడు.

"ఫాస్ట్‌ బౌలింగ్‌ను మేం బాగా మెరుగుపరుచుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్‌ చేయాలి. ప్రత్యర్థి బౌలర్లు ఏం చేస్తున్నారు, వారి వ్యూహాలు ఏంటి అనేది కూడా గమనించడం ఇక్కడ చాలా ముఖ్యం. ముఖ్యంగా బౌలర్లు నోబాల్స్‌ వేయకుండా బంతులను సంధించాలి. ఎక్స్‌ట్రా వైడ్లు తగ్గించాలి. ఈ మ్యాచ్‌లో మేం అదనపు పరుగులు ఎక్కువగా ఇచ్చేశాం. వాటిని తగ్గించాలి. లేదంటే ఇక కొత్త కెప్టెన్సీలో మా జట్టు ఆడుతుంది. ఇది నా సెకండ్​ వార్నింగ్‌. ఇకపై ఇదే తప్పు జరిగితే సారథ్యం నుంచి తప్పుకుంటా" అని మహీ హెచ్చరించాడు. ఇక అంతకుముందు గుజరాత్‌ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్​ బౌలర్లు 12 ఎక్స్​ట్రాలు వేశారు. అదనపు పరుగులను సమర్పించుకున్నారు. సమర్పించుకున్నారు. అందులో నాలుగు వైడ్‌లు, 6 లెగ్‌బైస్‌, 2 నో బాల్స్‌ ఉన్నాయి.

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్కే.. లఖ్​నవూపై గెలిచి తన తొలి విజయాన్ని నమోదు చేసింది. చెపాక్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. 217 పరుగుల భారీ లక్ష్యాన్ని లఖ్‌నవూకు నిర్దేశించింది. అయితే లక్ష్య ఛేదనలో కేఎల్‌ రాహుల్‌ టీమ్​ ఫస్ట్​ బలంగానే కనిపించింది. కైల్‌ మేయర్స్‌ 22 బంతుల్లో 53 పరుగులు చేసి చెన్నైని భయపెట్టేశాడు. నికోలస్​ పూరన్​(32), బదోనీ(23) రాణించారు. మిగతా వారు విఫలమయ్యారు. చివరకు లఖ్​నవూను 205 పరుగులకు కట్టడి చేసి సీఎస్కే విజయాన్ని దక్కించుకుంది.

ఇదీ చూడండి: IPL 2023 Impact player: ఈ ప్లేయర్స్​ అస్సలు 'ఇంపాక్ట్​' చూపించలేదుగా!

Last Updated :Apr 4, 2023, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.