ETV Bharat / sports

'వచ్చే సీజన్​లో కొత్త వెర్షన్​ 'కోహ్లీ'ని చూస్తారు'

author img

By

Published : Dec 1, 2021, 9:23 AM IST

ఆర్సీబీ కోహ్లీ రిటెన్షన్​, rcb retentin kohli
ఆర్సీబీ కోహ్లీ రిటెన్షన్​

RCB retain kohli: ఆర్సీబీ తనను రిటెయిన్​ చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశాడు కోహ్లీ. వచ్చే సీజన్​లో తనలోని కొత్త కోణాన్ని చూస్తారని అన్నాడు. తమ జట్టు మరింత ఉత్తమంగా ఆడుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

rcb retained players 2021: ఐపీఎల్​లో వచ్చే మూడు సీజన్ల పాటు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నాడు కోహ్లీ. ఆర్సీబీ వీడాలన్న ఆలోచనే తనకు అస్సలు లేదని చెప్పాడు. నవంబరు 30న జరిగిన రిటెన్షన్​ ప్రక్రియలో ఆర్సీబీ.. కోహ్లీ, మ్యాక్స్​వెల్​, మహ్మద్​ సిరాజ్​ను తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశాడు విరాట్​.

"ఆర్సీబీ నన్ను రిటెయిన్​ చేసుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి మా ప్రయాణం అద్భుతం కొనసాగుతోంది. జట్టు వీడాలన్న ఆలోచన నాకు అస్సలు రాలేదు. ఇంకో మూడేళ్ల పాటు మేం కలిసి జర్నీ చేయబోతుండటం నాకెంతో సంతోషంగా ఉంది. వచ్చే సీజన్లలో మా జట్టు మరింత ఉత్తమంగా ఆడుతుందని భావిస్తున్నాను. వచ్చే సీజన్​ ఎలా సాగబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మాకు అద్భుతమైన ఫ్యాన్ బేస్​, మేనేజ్​మెంట్​ ఉంది. మైదానంలో నాలోని కొత్త వెర్షన్​(పునరుత్తేజాన్ని) చూస్తారు."

-కోహ్లీ.

రిటెన్షన్​ ప్రక్రియలో కోహ్లీతో(రూ.15 కోట్లు) పాటు మ్యాక్స్‌వెల్‌ (రూ.11 కోట్లు), మహమ్మద్‌ సిరాజ్​ను(రూ.7 కోట్లు) తీసుకుంది ఆర్సీబీ. ముగ్గురు ప్లేయర్ల కోసం రూ.33 కోట్లను ఖర్చు చేసింది. మిగతా జట్టు కోసం రూ.57 కోట్లను కేటాయించనుంది(RCB retained players). దేవదత్‌ పడిక్కల్‌, యజ్వేంద్ర చాహల్‌ను వేలంలో కొనుగోలు చేయనుంది! కాగా, మెగావేలంలో మరింత మంది అద్భుత ప్లేయర్లను కొనుగోలు చేసి తమ జట్టును మరింత బలంగా తయారుచేస్తామని అన్నారు ఆర్సీబీ డైరెక్టర్​ మైక్​ హెసన్​.

ఇదీ చూడండి: ఐపీఎల్ రిటెన్షన్ పూర్తి జాబితా వచ్చేసింది.. ఎవరికి అత్యధిక ధరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.