ETV Bharat / sports

ఐపీఎల్​లో వికెట్​ కీపర్​గా ధోనీ రికార్డు

author img

By

Published : Oct 5, 2020, 9:23 AM IST

Dhoni
ధోనీ

సీఎస్కే​ కెప్టెన్​ ధోనీ.. ఐపీఎల్​​లో 100 క్యాచ్​లు పట్టిన రెండో వికెట్​ కీపర్​గా గుర్తింపు సాధించాడు. పంజాబ్​తో మ్యాచ్​తో ఈ ఘనతను అందుకున్నాడు.

చెన్నై సూపర్​ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోనీ మరో ఘనత సాధించాడు. ఐపీఎల్​లో వికెట్​ కీపర్​గా 100 క్యాచ్​లు పట్టి రికార్డు నెలకొల్పాడు. కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​తో ఆదివారం మ్యాచ్​లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. కోల్​కతా నైట్​రైడర్స్ కెప్టెన్​ దినేశ్​ కార్తీక్​.. మహీ కంటే ముందున్నాడు. అతడు​ ఇప్పటివరకు 186 మ్యాచ్​ల్లో 103 క్యాచ్​లు పట్టాడు.

Dhoni
ధోనీ

ఇటీవలే సన్​రైజర్స్​ పోరుతో.. ఐపీఎల్​లో అత్యధిక మ్యాచ్​లు(194) ఆడిన ఆటగాడిగానూ ధోనీ రికార్డును సొంతం చేసుకున్నాడు. తన సహచరుడు రైనా(193)ను అధిగమించాడు. చెన్నై తరఫున ధోనీకి ఇది 164వ మ్యాచ్​. సీఎస్‌స్కేపై రెండేళ్ల నిషేధం కారణంగా 2016, 17 సీజన్లలో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ తరఫున ధోనీ 30 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుత ఆటగాళ్లలో రోహిత్​ శర్మ(193), కోహ్లీ(180) ధోనీకి చేరువలో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.