ETV Bharat / sports

Squid game netflix: టీమ్​ఇండియా 'స్క్విడ్​గేమ్'​ ఛాలెంజ్

author img

By

Published : Oct 21, 2021, 12:06 PM IST

'స్క్విడ్​గేమ్​'లోని(squid game movie) 'డల్​గోనా క్యాండీ' ఛాలెంజ్​ను స్వీకరించారు టీమ్​ఇండియా ప్లేయర్స్​(t20 worldcup teamindia squad). దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ పోస్ట్​ చేయగా.. అది కాస్త వైరల్​గా మారింది. అభిమానులను ఆకట్టుకుంటోందీ వీడియో.

teamindia
టీమ్​ఇండియా

'స్క్విడ్​గేమ్​'(squid game movie netflix).. ప్రస్తుతం ఎక్కడ చూసిన సినీప్రియులు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. నెట్​ఫ్లిక్స్​లో(squid game review) విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోందీ చిత్రం. ఇప్పుడా వెబ్ సిరీస్​లోని 'డల్​గోనా క్యాండీ' ఛాలెంజ్​ను(squidgame movie challenges) స్వీకరించి అభిమానులను సోషల్​మీడియా వేదికగా అలరిస్తున్నారు టీమ్ఇండియా ప్లేయర్స్​. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ పోస్ట్​ చేసింది. 'నరాలు తెగే ఉత్కంఠకు గురిచేసే గేమ్​లో' టీమ్​ఇండియా పాల్గొంది అని వ్యాఖ్య జోడించింది.

ఈ ఛాలెంజ్​లో భాగంగా క్యాండీలో ఉన్న ఆకారాన్ని ఏమాత్రం దెబ్బతినకుండా బయటకు తీయాలి. అలా తీయలేకపోయిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయడం ఈ వెబ్​సిరీస్​లో చూడొచ్చు. ఆ సవాల్​నే మన ప్లేయర్స్ సరదాగా తీసుకుని ఆడారు.

ఈ గేమ్​లో రోహిత్​ శర్మ, మహ్మద్​ షమి గెలవగా.. సూర్యకుమార్​ యాదవ్​, కేఎల్ రాహుల్​, జస్ప్రిత్​ బుమ్రా, వరుణ్​ చక్రవర్తి ఓడిపోయారు. టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా తమ తొలి మ్యాచ్​ను అక్టోబర్​ 24 పాకిస్థాన్​తో(t20 worldcup teamindia pakisthan match) తలపడనుంది. ఈ పోరు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చూడండి:

నమ్జా-చింగూ, యోజా చింగూ.. ఎక్కడ చూసినా కొరియన్​ హవా!

squid game web series: 'స్క్విడ్‌గేమ్‌'కు ఎందుకింత క్రేజ్‌?

T20 World Cup: భారత్​ 5, పాక్​ 0.. ఈసారి గెలుపెవరిది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.