ETV Bharat / sitara

నమ్జా-చింగూ, యోజా చింగూ.. ఎక్కడ చూసినా కొరియన్​ హవా!

author img

By

Published : Oct 21, 2021, 9:32 AM IST

కొంత కాలం(squid game netflix review) నుంచి కొరియన్​ సినిమాలు, పాటలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్​ పెరిగింది. వీటిని ఎక్కువగా వీక్షించే దేశాల్లో భారత్​ కూడా ఉండటం విశేషం(korean movies netflix india). ఇవి చూసి ఇక్కడి సినీప్రియులు కొరియన్​ భాష నేర్చుకోవడం సహా ఆ దేశ సంస్కృతి, జీవనశైలి​, ఫ్యాషన్​ను అలవరుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కొరియన్​ హవా ఎలా మొదలైందో తెలుసుకుందాం.

squid
స్క్విడ్​

'క్రాస్​ ల్యాండింగ్​ ఆన్​ యు', 'విన్​సెన్జో', 'పారాసైట్'​, 'హంగర్​ గేమ్స్'​, 'కింగ్​డమ్​ సీజన్​ 2', 'ఇట్స్ ఓకే టు నాట్​ బీ ఓకే' ఈ పేర్లు దాదాపు చాలా మంది సినీప్రియులకు తెలిసే ఉంటుంది(korean movies netflix india). ఎక్కడ చూసిన బీటీఎస్​ (బ్యాంగ్​టన్ బాయ్స్) పాటలు ప్రస్తుతం యువతను తెగ ఊర్రూతలూగిస్తున్నాయి. ఇవన్నీ కొరియన్​ సినిమాలు, గీతాలు. ప్రయోగాలకు, వైవిధ్యతకు ఇవి కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తున్నాయి. బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాల సమాహారంగా సినిమాలను తెరకెక్కించడంలో కొరియన్​ దర్శకనిర్మాతలు విజయవంతమవుతున్నారు. అందుకే కొంత కాలం నుంచి ఓటీటీ, సోషల్​మీడియా, థియేటర్​ ఇలా ఎంటర్​టైన్మెంట్ వేదిక ఏదైనా.. ఈ కొరియన్ హవా కవిపిస్తోంది. ఆస్కార్​ ఉత్తమ చిత్రంగా నిలిచిన 'పారాసైట్'​తో పాటు ఈ భాషకు సంబంధించిన చాలా చిత్రాలు, సిరీస్​లు విశేష ప్రేక్షకాదరణతో పాటు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. భారత్​లోనూ వీటి హవా కనిపిస్తుండటం విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హల్​చల్ చేస్తున్న 'స్క్విడ్‌ గేమ్‌'

రీసెంట్​గా ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్‌లో(squid game characters) విడుదలై నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న 'స్క్విడ్‌ గేమ్‌' సిరీస్​.. కొరియన్​ ఎంటర్​టైన్మెంట్​కు ప్రేక్షకులు ఎంతగా అలవాటు పడ్డారో చెబుతుంది.(squid game netflix review). దీన్ని దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్‌ డాంగ్‌ హ్యుక్ తెరకెక్కించారు(squid game netflix review). ప్రస్తుతం నెట్​ఫ్లిక్​లో ట్రెండింగ్​లో దూసుకెళ్తోంది!

"నెట్​ఫ్లిక్స్​ టాప్​-10 కేటగిరీలో 'స్క్విడ్​ గేమ్'​, 'హోమ్​టౌన్​ చా చా చా', 'కింగ్​డమ్​ సీజన్​ 2', 'ఇట్స్​ ఓకే టు నాట్​ బి ఓకే', 'క్రాష్​ ల్యాండింగ్' చోటు దక్కించుకున్నాయి. 22 మిలియన్లకు పైగా మంది హారర్​ టీవీ సిరీస్​ 'స్వీట్​ హోమ్'​ను వీక్షించారు."

-నెట్​ఫ్లిక్స్​ కో సీఈఓ.

కరోనా సమయంలో

ఈ కొరియన్​ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్​ క్రేజ్​ పెరిగింది. ఈ మూవీస్​ ఎక్కువగా వీక్షించే దేశాల్లో భారత్​ కూడా ఉండటం విశేషం. లాక్​డౌన్​ సమయం నుంచి ప్రేక్షకులు వీటిని ఎక్కువగా ఆదరించడం ప్రారంభించారని గణాంకాలు చెబుతున్నాయి.

కొరియన్​ ఎంటర్​టైన్మెంట్ ​(సినిమాలు, మ్యూజిక్​ ఆల్బమ్స్​) ద్వారా ప్రేక్షకులు అక్కడి​ కల్చర్​, లైఫ్​స్టైల్​, ఫ్యాషన్​ను అలవరుచు కుంటున్నారని అన్నారు న్యూదిల్లీ కొరియా టూరిజమ్​ ఆర్గనైజేషన్ డైరెక్టర్​ చోయ్​(Young-Geul Choi)​.

"కొరియన్​ చిత్రాలు, పాటలు, డ్రామాలు, వెబ్​సిరీస్​ను ఎక్కువ వీక్షించే దేశాల్లో భారత్​ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కొరియన్​ అభిమానులు.. ఆ దేశ లైఫ్​స్టైల్​, కల్చర్​, ఫ్యాషన్​కు ప్రభావితం అవుతున్నారు" అని తెలిపారు చోయ్​.

టాలీవుడ్​ భామ ఫిదా

చాలా మంది భారతీయ నటులు కూడా ఎంతో ఆసక్తిగా, ఇష్టంగా ఈ కొరియన్​ చిత్రాలను వీక్షిస్తున్నారు. అందులో నటి ప్రియమణి కూడా ఒకరు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. "ది బ్రైడ్​ ఆఫ్​ హబేక్'​, 'క్యూట్'​, 'డిసెండెంట్స్​ ఆఫ్​ ది సన్​', 'లవ్​ అఫైర్'​ వంటి సినిమాలు చూశా. సాంగ్​ జూంగ్​కి పెద్ద అభిమానిని. అతడి నటన చూసి తనతో ప్రేమలో పడిపోయా" అని ప్రియమణి వెల్లడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

లాంగ్వేజ్​పై ఆసక్తి

ఈ కొరియన్​ సినిమాలు చూడటం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది అభిమానులు సబ్​టైటిల్స్​ ద్వారా కొరియన్​ పదాలను నేర్చుకోవడం, ఉపయోగించడం మొదలుపెట్టారు. 'నూనా అండ్​ ఒప్పా'(పెద్ద చెల్లి, పెద్ద అన్నయ్య), 'నమ్జా చింగూ'(బాయ్​ఫ్రెండ్​), 'యోజా చింగూ'(గర్ల్​ఫ్రెండ్​), 'సరంగ్​ హే'(ఐ లవ్​ యు).. ఇలా అనేక పదాలను వీక్షకులు నేర్చుకున్నారు! రీసెంట్​గా ఆక్స్​ఫర్డ్​ ఇంగ్లీష్ డిక్షనరీలో 'కే-డ్రామా', 'హల్యూ'(hallyu), 'కిమ్​బాప్' సహా ​ 26 కొరియన్​ పదాలను చేర్చారు.

లాంగ్వేజ్​ సెంటర్

ఈ భాషను​ నేర్పించడానికి మూడు నెలల ఆన్​లైన్​ కోర్సును ప్రవేశపెట్టింది కొరియన్​ కల్చరల్​ సెంటర్​ ఇండియా(కేసీసీఐ). రిజిస్ట్రేషన్​ ప్రారంభించిన రెండు మూడు నిమిషాల్లోనే దాదాపు 1200 స్లాట్స్​ బుక్​ అయ్యాయని తెలిపారు కేసీసీఐ డైరెక్టర్​ హవాంగ్(Hwang Il-yong).

సూపర్​హిట్​గా నిలిచిన కొన్ని కొరియన్​ సినిమాలు, సిరీస్​లు

స్క్విడ్​ గేమ్​, క్రాస్​ ల్యాండింగ్​ ఆన్​ యు, విన్​సెన్జో, పారాసైట్', హంగర్​ గేమ్స్​, కింగ్​డమ్​ సీజన్​ 2, ఇట్స్ ఓకే టు నాట్​ బీ ఓకే, మినారీ, అస్సాసినేషన్​, స్నోపీర్సర్​, హ్యాండ్​మైడెన్​, ఓజ్కా, బర్నింగ్​, మథర్​, ది విచ్​, వెటరన్​, ద థీవ్స్​, ట్రైన్​ టూ బుసాన్​, సియోల్​ సెర్చింగ్​, స్కాండల్​ మేకర్స్​, మిస్​గ్రానీ, ఎక్స్​ట్రీమ్​ జాబ్​, పొయెట్రీ, ఐ సా ది డెవిల్​.. సహా పలు చిత్రాలు ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: బెస్ట్ ఫ్రెండ్స్​తో సమంత.. విహారయాత్రలో సరదాగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.