ETV Bharat / sports

India Vs West indies 2023 : సమయం లేదు మిత్రమా.. ప్రపంచకప్​ ముందు ఆ ప్రశ్నలకు సమాధానం దక్కేనా ?

author img

By

Published : Aug 15, 2023, 11:09 AM IST

India Vs West indies 2023
India Vs West indies 2023

India Vs West indies 2023 : దాదాపు నెలరోజుల పాటు విండీస్​ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఇప్పుడు ప్రపంచ కప్​ కోసం కసరత్తులు చేస్తోంది. అయితే మనసులో అనేక ప్రశ్నలతో వెస్టిండీస్​కు టీమ్‌ఇండియా.. తమకున్న కొద్ది రోజుల వ్యవథిలో కొన్నింటికి సమధానం వెతుక్కుంది. కొన్నింటిని అలానే వదిలేసింది. అయితే అక్కడ వీరికి కొత్తగా కొన్ని ప్రశ్నలు రేకెత్తాయి. అవేంటి.. వాటికి సమధానం దక్కుతుందా ?

India Vs West indies 2023 : జూలై 12న అట్టహాసంగా మొదలైన విండీస్​ పర్యటన ముగిసింది. టెస్టుల్లో దూసుకెళ్లిన టీమ్ఇండియా పొట్టి ఫార్మాట్‌లో మాత్రం బోర్లా పడి.. సిరీస్​ను విండీస్‌కు అప్పగించేసింది. కరేబియన్​ జట్టును తక్కువ అంచనా వేసిన వేసిన హార్దిక్​ సేన.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్​లో 2-3 తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. యువ బ్యాటర్లు తప్ప.. సీనియర్లు పెద్దగా రాణించకపోవడం వల్ల టీమ్ఇండియాకు నిరాశే ఎదురైంది. అయితే వన్డే ప్రపంచకప్‌ సమీపిస్తున్న సమయంలో మదిలో అనేక ప్రశ్నలతో విండీస్​కు పయనమైన టీమ్‌ఇండియా.. ఈ నెల రోజుల వ్యవథిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాన్ని వెతుక్కోగా.. ఇంకొన్ని మాత్రం అలాగే ఉండిపోయాయి. మరోవైపు కొత్తగా కొన్ని ప్రశ్నలూ రేకెత్తాయి. అవేంటంటే..

ముగ్గురు మొనగాళ్ల కథ..
India Tour Of Westindies : విండీస్​తో ఆడనున్న భారత జట్టు కోసం ముగ్గురు యువ ఆటగాళ్లు తొలిసారి కరేబియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ ఆటగాళ్లు మ్యాచుల్లో తమ సత్తా చాటగలరా లేదా అన్న ప్రశ్నకు మాత్రం సానుకూల సమాధానమే దొరికింది. ఎంతో ఆశలతో క్రీజులోకి దిగిన ఆ ముగ్గురు.. తమకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించారు.

Yashasvi Jaiswal Westindies Records : అయితే అందరిలోకి ఎక్కువ ఆకట్టుకున్నది యశస్వి జైస్వాల్​. ఐపీఎల్‌లో అదరగొట్టిన ఈ యంగ్​ ప్లేయర్​.. వెస్టిండీస్‌ పర్యటనతోనే టెస్టులతో పాటు టీ20ల్లోనూ అరంగేట్రం చేశాడు. తొలి సారి అయినప్పటికీ.. టెస్టుల్లో తొలి మ్యాచ్‌ల్లోనే 171 పరుగులు చేసి అందరి చేత శెభాష్​ అనిపించుకున్నాడు. ఇక రెండో టెస్టులో అయితే ఓ అర్ధశతకాన్ని తన ఖాతాలోకి వేసుకుని చెలరేగిపోయాడు.మొత్తంగా ఈ సిరీస్‌లో 88.66 సగటుతో 266 పరుగులు చేశాడు యశస్వి. అంతే కాకుండా టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడిన జైస్వాల్​.. 90 పరుగులు సాధించి సెంచరీకి చేరువయ్యాడు. అలాగే నాలుగో టీ20లో 84 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు.

Tilak Varma India Vs West Indies : అరంగేట్రంలోనే అదరగొట్టిన మరో యువ ఆటగాడు తిలక్‌ వర్మ. 20 ఏళ్ల ఈ హైదరాబాదీ కుర్రాడు.. ఆడిన 5 టీ20ల్లో 57.66 సగటుతో 173 పరుగులు సాధించి రికార్డుకెక్కాడు. మిడిలార్డర్లో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్​.. తన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి టీమ్‌ఇండియా భవిష్యత్‌ స్టార్‌గా కితాబులందుకున్నాడు. బ్యాటింగ్​తోనే కాదు చివరి టీ20లో అతను బౌలింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. తిలక్‌ అత్యద్భుత ప్రదర్శనను వీక్షించిన అభిమానులు వన్డే జట్టులోకి కూడా అతణ్ని ఎంపిక చేసి ప్రపంచకప్‌లో ఆడించాలన్న డిమాండ్లు చేస్తున్నారు.

Mukesh Kumar Wickets : ఇక బెంగాలీ యంగ్​ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌.. విండీస్​ పర్యటనతోనే ఒకేసారి టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఎక్కువ వికెట్లు పడగొట్టకపోయినప్పటికీ.. చక్కటి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులను వేయడంతో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో అతను పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. దీంతో బుమ్రా లేక బలహీన పడ్డ బౌలింగ్‌ విభాగానికి తన స్కిల్​తో కొంత బలాన్ని చేకూర్చాడు. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి అతను 9 వికెట్లు తీశాడు.

Ishan Kishan West Indies Tour : మరోవైపు ఇషాన్‌ కిషన్‌ కూడా వన్డేల్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లు విఫలమైన ఈ సిరీస్‌లో అతను 3 మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలు బాది ఔరా అనిపించాడు. 61.33 సగటుతో 184 పరుగులు సాధించాడు. శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ ప్రపంచకప్‌ ఆడటంపై సందేహాలు నెలకొన్న తరుణంలో ఈ ప్రదర్శనతో ఇషాన్‌ జట్టుకు భరోసానిచ్చాడు.

వారు ఉపయోగించుకోలేదు...
Surya Kumar Innings in India vs West Indies : మరోవైపు తమకిచ్చిన మంచి అవకాశాలను ఇద్దరు ఆటగాళ్లు ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. వారే సంజూ శాంసన్​, సూర్యకుమార్​ యాద్​. టీ20 క్రికెట్లో అతడు ఆడిన తీరును చూసి వన్డేల్లోనూ సత్తా చాటుతాడని జట్టు యాజమాన్యం సూర్యకుమార్​కు మంచి ఛాన్స్​ ఇచ్చింది. కానీ ఇప్పటిదాకా 26 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్​.. కేవలం 511 పరుగులే చేశాడు. ఇక వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ 3 మ్యాచ్‌లాడి 78 పరుగులే చేశాడు. అయితే టీ20ల్లో మాత్రం అదరగొట్టాడు. కానీ వన్డే ఫార్మాట్లో అతను నిలదొక్కుకోలేకపోతున్నాడు. ఈ ప్రదర్శనతో అతను ప్రపంచకప్‌ ఆడటం కష్టమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Sanju Samson West Indies Tour : ఇక కేరళ కుర్రాడు సంజు శాంసన్‌కు అవకాశాలివ్వడం లేదని బాధపడే అభిమానులకు ఈ సిరీస్‌తో ఆ లోటు తీరిపోయింది. వన్డే సిరీస్‌లో 2, టీ20ల్లో 5 మ్యాచ్‌ల్లో అతణ్ని ఆడించారు. అయితే ఒక వన్డేలో అర్ధశతకం సాధించిన అతను.. 3 టీ20ల్లో మాత్రం 32 పరుగులే సాధించగలిగాడు. దీంతో వన్డేల్లోనే కాదు టీ20ల్లోనూ అతడికి చోటు కష్టంగానే కనిపిస్తోంది.

ఇది అస్సలు ఊహించనిది..
Hardik Pandya West Indies Tour : తాజాగా జరిగిన విండీస్​ పర్యటనతో ఇద్దరు కీలక ఆటగాళ్ల సామర్థ్యంపై ప్రశ్నలు మొదలయ్యాయి. టీ20ల్లో కెప్టెన్‌ అయిన హార్దిక్‌ పాండ్య అనూహ్యంగా అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ అతను సత్తా చాటలేకపోయాడు. వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌లాడి అతను చేసింది 82 పరుగులే. ఒక మ్యాచ్‌లో అర్ధశతకం మినహా అతను మరేం స్కోర్ చేయలేదు. ఇక ఈ సిరీస్‌లో బౌలర్‌గా అతను పడగొట్టింది కేవలం ఒక్క వికెట్టే. టీ20ల్లో 5 మ్యాచ్‌ల్లో 25.6 సగటుతో 77 పరుగులు సాధించాడు. అప్పుడు అతని స్ట్రైక్‌ రేట్‌ కేవలం 110 మాత్రమే. ఈ సిరీస్‌లో అతను 4 వికెట్లు తీశాడు. దీంతో ఆల్‌రౌండర్‌ పాత్రకు హార్దిక్‌ న్యాయం చేసి చాలా కాలమవుతోందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఐపీఎల్‌లో అదరగొట్టి సూపర్‌స్టార్‌గా పేరొందిన శుభ్‌మన్‌ గిల్‌.. వెస్టిండీస్‌ పర్యటనలో ఆశించిన స్థాయిలో ఆడలేదు. టెస్టుల్లో 2 మ్యాచ్‌లాడి 45 పరుగులే చేసిన అతను... వన్డేల్లో మాత్రం ఒక్క అర్ధశతకాన్ని మాత్రమే నమోదు చేశాడు. అంతే కాకుండా 5 టీ20ల్లో కలిపి ఒక్కసారే 50 దాటాడు. సిరీస్‌లో 20 సగటుతో 102 పరుగులే చేశాడు. దీంతో శుభ్‌మన్‌ ప్రతాపం భారత పిచ్‌ల మీదేనా అన్న సందేహాలు తలెత్తాయి.

'టీమ్​ ప్లేయర్స్ ఎలా ఆడారనేది నాకు తెలుసు.. ఒక్కోసారి ఓటమి నుంచే పాఠాలు'

అరంగేట్ర మ్యాచ్​లో జైస్వాల్​ రికార్డు.. ఆ ప్లేయర్​కు చేరువలో విరాట్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.