ETV Bharat / sports

Ind Vs WI T20 : టీమ్​ఇండియా @200.. టీ20ల్లో మన స్టార్ ప్లేయర్ల రికార్డులు తెలుసా?

author img

By

Published : Aug 6, 2023, 11:11 AM IST

Ind Vs WI T20
Ind Vs WI T20

Ind Vs WI T20 : తన 18 ఏళ్ల టీ20 క్రికెట్​ చరిత్రలో టీమ్​ఇండియా జట్టు ​తాజాగా 200 మ్యాచ్​లు పూర్తి చేసుకుంది. ఇటీవలే వెస్టిండీస్​తో జరిగిన టీ20 వేదికగా భారత ప్లేయర్లు ఈ రికార్డును తమ పేరిట రాసుకుంది. ఈ నేపథ్యంలో భారత ప్లేయర్లు.. నెలకొల్పిన అరుదైన రికార్డులను ఓ సారి తెలుసుకుందాం.

Ind Vs WI T20 : వెస్టిండీస్​ పర్యటనలో తొలి టీ20 ఆడిన టీమ్ఇండియా.. పొట్టి ఫార్మాట్​లో 200 మ్యాచ్​లు పూర్తి చేసుకుంది. 2006 సౌతాఫ్రికా సిరీస్​లో​ మాజీ బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ సారధ్యంలో భారత్ తొలి టీ20 మ్యాచ్ ఆడింది. మొదటి మ్యాచ్​లోనే ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది టీమ్ఇండియా. ఇక 200 మ్యాచ్​లకు గాను 127 సార్లు నెగ్గిన భారత్.. 64 మ్యాచ్​ల్లో ఓడింది. నాలుగింటిని డ్రా గా ముగించింది. ఐదింట్లో ఫలితం తేలలేదు. ఈ క్రమంలో భారత్ తరఫున కొన్ని అరుదైన రికార్డులు సాధించిన ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం.

  1. అత్యధిక వ్యక్తిగత స్కోర్..
    టీ20ల్లో 2023లో అరంగేట్రం చేసిన యంగ్ ప్లేయర్ శుభ్​మన్ గిల్.. న్యూజిలాండ్​పై అజేయ శతకం (126*) సాధించాడు. అయితే గిల్ చేసిన 126 పరుగులే ఇప్పటివరకు టీమ్ఇండియాలో అత్యధిక వ్యక్తిగత స్కోర్.
  2. అత్యధిక పరుగులు..
    స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టీ20ల్లో 115 మ్యాచ్​ల్లో కలిపి 4008 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20ల్లో ఎక్కువ పరుగులు చేసి టాప్​లో ఉన్నాడు. వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ లలిస్ట్​లో లిస్ట్​లో 3853 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
  3. టాప్ వికెట్లు..
    స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 76 మ్యాచ్​ల్లో కలిపి 93 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత పేసర్ భువనేశ్వర్ కుమార్ 90 వికెట్లతో రెండో ప్లేస్​లో ఉన్నాడు.
  4. బెస్ట్ ఎకనమీ..
    టీ20ల్లో కనీసం 25 మ్యాచ్​లు ఆడిన ప్లేయర్లలో హర్భజన్ సింగ్ 6.20 ఎకమీతో టాప్​లో కొనసాగుతున్నారు.
  5. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్..
    పేసర్ దీపక్ చాహర్ 7 పరుగులిచ్చి 6 వికెట్లు (6/7) తీశాడు. ఇది భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.
  6. అత్యధిక సిక్సర్లు..
    టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. టీ20ల్లో 182 సిక్సర్లు సంధించాడు. ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాడు.
  7. అత్యుత్తమ స్ట్రయిక్ రేట్..
    టీ20 స్ట్రయిక్ రేట్​లో 360 డిగ్రీల ఆటగాడు సూర్యకుమార్ యాదవ్​దే హవా. అతడు 49 మ్యాచ్​ల్లో కలిపి 174 స్ట్రయిక్ రేట్​తో 1696 పరుగులు చేశాడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.