ETV Bharat / sports

Dravid: పార్ట్​టైమ్​ బౌలర్​గా ద్రవిడ్.. మీకు తెలుసా?​

author img

By

Published : Jun 24, 2021, 10:03 AM IST

rahul dravid, former india batsmen
రాహుల్ ద్రవిడ్, టీమ్ఇండియా మాజీ బ్యాట్స్​మన్

బ్యాట్స్​మన్​గానే మనకు తెలిసిన రాహుల్ ద్రవిడ్​లో పార్ట్​టైమ్​ బౌలర్ కూడా ఉన్నాడని మీకు తెలుసా? అవునా అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే చాలా తక్కువగానే బౌలింగ్ చేసిన ఇతడు.. అత్యుత్తమ బ్యాట్స్​మెన్​ వికెట్లే తీయడం విశేషం.

భారత క్రికెట్​ చరిత్రలో 'ది వాల్​'గా పేరు గాంచిన రాహుల్​ ద్రవిడ్​.. కెరీర్​ ఆరంభంలో బౌలింగ్ చేశాడన్న విషయం ఎంత మందికి తెలుసు. జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో పార్ట్​ టైమ్​ బౌలర్​గా కొన్ని వికెట్లు కూడా తీశాడు.

తన బ్యాటింగ్​తో వన్డేలతో పాటు టెస్టుల్లో టీమ్ఇండియా తరఫున కొన్నేళ్లపాటు కీలక పాత్ర పోషించాడు ద్రవిడ్​. అయితే కెరీర్​ ఆరంభంలో బౌలింగ్ చేసిన ఇతడు.. పాకిస్థాన్​ ఓపెనర్​ సయిద్​ అన్వర్​, దక్షిణాఫ్రికా బ్యాట్స్​మెన్ లాన్స్​ క్లూసెనర్​, రైడ్లీ జాకబ్స్ తదితరుల​​ వికెట్లు తీశాడు. మొత్తంగా తన కెరీర్​లో ఐదు వికెట్లు పడగొట్టాడు. జట్టు అవసరాల కోసం కీపింగ్ కూడా చేశాడు.

టెస్టుల్లో 164 మ్యాచ్​లాడిన ద్రవిడ్​.. 42.5 స్ట్రైక్​ రేట్​తో 13వేల పైగా పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో జాకబ్స్​ వికెట్​తో తన ఖాతాలో తొలి వికెట్​ వేసుకున్నాడు. వన్డేల్లో 344 మ్యాచ్​లాడిన రాహుల్​.. 71.2 స్ట్రైక్​ రేట్​తో 10వేల మార్క్​ను అధిగమించాడు. టెస్టు స్పెషలిస్ట్​గా పేరుగాంచిన అతడు.. పొట్టి ఫార్మాట్​లోనూ ఫర్వాలేదనిపించాడు. ఒకే టీ20లో భారత్​కు ఆడిన అతడు 31 పరుగులు చేశాడు. ఐపీఎల్​లోనూ 89 మ్యాచ్​లాడిన ది వాల్​.. 2,174 పరుగులు సాధించాడు.

2015 నుంచి ఇండియా-ఏతో పాటు అండర్​-19 జట్లకు కోచ్​గా పనిచేసిన ద్రవిడ్.. 2019లో జాతీయ క్రికెట్ అకాడమీకి చీఫ్​గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా జట్టుకు కోచ్​గా వ్యవహరిస్తున్నాడు.

ఇదీ చదవండి: కివీస్​ కీపర్​కు కోహ్లీ అభినందనలు.. కారణమిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.