ETV Bharat / sports

'ప్రపంచకప్​ టీమ్​లో అతడు ఉండాల్సిందే.. అలా అయితేనే​ కప్పు గెలుస్తాం'.. జోస్యం చెప్పిన దాదా!

author img

By

Published : Jul 4, 2023, 8:04 PM IST

Updated : Jul 4, 2023, 8:12 PM IST

Dada On ODI World Cup 2023
ప్రపంచకప్​ టీమ్​లో అతడు ఉండాల్సిందే.. అలా అయితేనే​ కప్పు గెలుస్తాం.. జోస్యం చెప్పిన దాదా..!

ODI World Cup 2023 : భారత్​ ఆతిథ్యమిస్తున్న 2023 ప్రపంచకప్​ టీమ్ఇండియా జట్టులో సీనియర్​ స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ ఉండాల్సిందే అని టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ సౌరభ్​ గంగూలీ అన్నాడు. మిగతా స్పిన్నర్లను కూడా జట్టు కూర్పు చేసే సమయంలో పరిగణనలోకి తీసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు.

ODI World Cup 2023 : అక్టోబర్​-నవంబర్ మధ్య భారత్​లో జరిగే వన్డే వరల్డ్​కప్​ భారత జట్టులో సీనియర్​ స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ ఉండాల్సిందేనని టీమ్​ఇండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ అన్నాడు. జట్టు విజయాల్లో స్పిన్నర్లు అత్యంత కీలకపాత్ర పోషిస్తారని ఆయన అన్నాడు.

భారత్​లోని పిచ్​లపై మణికట్టు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మిగతా టీమ్​ల బ్యాటర్లు చాలా కష్టపడాల్సి ఉంటుందని.. ఇంతకు ముందు 2011 ప్రపంచకప్​లో కూడా ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశాడు. అందుకనే భారత జట్టులో కీలకంగా ఉన్న సీనియర్ స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​కు ఈసారి జట్టులో కచ్చితంగా అవకాశం కల్పించాలని కోరాడు. ఈ క్రమంలో చాహల్​ బౌలింగ్​ను ఫేస్​ చేసేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని దాదా చెప్పుకొచ్చాడు. జట్టు విజయాల్లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని దాదా అభిప్రాయం వ్యక్తం చేశాడు.

"సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్​తో పాటు రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్​ వంటి మణికట్టు స్పిన్నర్లను కూడా ఈ మధ్య మెగా టోర్నీల్లో ఆడించడం లేదు. ఇది సరైంది కాదు. చాహల్​ ఉంటే మ్యాచ్​ ఫలితాలు మనకు అనుకూలంగా వచ్చేవి. ఏ ఫార్మాట్​లోనైనా చాహల్​ ప్రదర్శన మాత్రం నిలకడగానే ఉంటుంది. దీని ఆధారంగా ప్రపంచకప్​ జట్టు కూర్పు విషయంలో అతడి ఎంపికపై కూడా సెలక్టర్లు దృష్టి పెట్టి.. కచ్చితంగా ఆడించాలి."

- సౌరభ్​ గంగూలీ, మాజీ కెప్టెన్​

కూర్పు సరైందైతే.. కప్పు మనదే..
Ex Cricketers On India World Cup Win : భారత్​ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీకి సంబంధించి షెడ్యూల్​ విడుదలైనప్పటి నుంచి ఈసారి కప్పును ఎవరు ఎగరేసుకుపోతారు?.. ఫలానా జట్టులో ఏ ఆటగాళ్లు ఉంటే జట్టుకు విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. చివరిసారిగా 2011లో వన్డే ప్రపంచకప్​ గెలిచిన భారత్​కు ఈసారి సొంత గడ్డపై జరిగే మ్యాచ్​ అత్యంత కీలకమని.. మళ్లీ కప్పు గెలిచేందుకు ఇదే సరైన సమయమని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. టీమ్​ సెలక్షన్​ విషయంలో సెలక్టర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తే టోర్నీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాచ్​ షెడ్యూల్​..
ICC World Cup 2023 Schedule : ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వరల్డ్​కప్​ సమరం ప్రారంభం కానుంది. మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ పోరుకు సంబంధించిన మొదటి మ్యాచ్​ ఇంగ్లాండ్​-న్యూజిలాండ్​ మధ్య అహ్మదాబాద్​లో జరగనుంది. అయితే భారత్​ తన తొలి మ్యాచ్​ ఆస్ట్రేలియాతో అక్టోబర్​ 8న తలపడనుంది. ఇక అందరికి ఆసక్తిని రేకెత్తించే దాయాదుల పోరు (పాకిస్థాన్​-ఇండియా మ్యాచ్​) అక్టోబర్​ 15న అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది.

ICC World Cup 2023 Schedule
ఐసీసీ క్రికెట్​ వరల్డ్​కప్​ 2023 షెడ్యూల్​
Last Updated :Jul 4, 2023, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.