ETV Bharat / sports

నాన్న ఇచ్చే 60 రూపాయలతో ప్రాక్టీసుకు వచ్చేవాడిని: సిరాజ్

author img

By

Published : Feb 18, 2022, 10:11 PM IST

Siraj Cricketer News
సిరాజ్

Siraj Cricketer News: తండ్రి ఇచ్చిన రూ.60తోనే ట్రైనింగ్​కు వెళ్లి వచ్చేవాడినని తన కెరీర్​ ప్రారంభంలోని విషయాలను చెప్పుకొచ్చాడు టీమ్​ఇండియా బౌలర్​ సిరాజ్. ఆ రోజు కోహ్లీ ఇచ్చిన సర్​ప్రైజ్​ తన జీవితంలో మర్చిపోలేనని పేర్కొన్నాడు. ఐపీఎల్​ ద్వారానే తనకు పేరు వచ్చిందని అన్నాడు.

Siraj Cricketer News: ఐపీఎల్​తో వెలుగులోకి వచ్చిన స్టార్​ పేసర్​ సిరాజ్​ అతితక్కువ కాలంలోనే మేటి బౌలర్​గా పేరు తెచ్చుకున్నాడు. టీమ్​ఇండియా టెస్టు జట్టులో కీలక బౌలర్​గా మారాడు. ప్రస్తుతం రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఫ్రాంఛైజీకి ఆడుతున్న సిరాజ్​.. తన తొలినాళ్లలో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. తన తండ్రి ఆటో డ్రైవర్​గా పనిచేసేవారని.. ఆయన రోజుకు ఇచ్చే రూ. 60తోనే ఉప్పల్​ స్టేడియానికి వెళ్లి ట్రైనింగ్​ తీసుకునేవాడినని తెలిపాడు.

"నేను అప్పట్లో చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. మా నాన్న ఓ ఆటో డ్రైవర్​. నాకు ప్లాటినా బైక్​ ఉండేది. పెట్రోల్​ ఖర్చులకని నాన్న ఇచ్చిన రూ.60తోనే ఉప్పల్​ స్టేడియానికి వెళ్లి శిక్షణ తీసుకునే వాడిని. నేను ఐపీఎల్​లోకి ఎంపికయ్యాక నా కష్టాలన్నీ తీరాయి. నాన్న ఆటో నడపడం ఆపేశారు. మేము కొత్త ఇల్లు తీసుకున్నాం. నాకు ఇంతకన్నా ఏం అక్కర్లేదు. ఐపీఎల్​ నాకు పేరు తెచ్చింది.. సమాజంలోని వివిధ వ్యక్తులతో ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో నేర్పింది."

-మహమ్మద్​ సిరాజ్, పేస్​ బౌలర్

విరాట్​ నుంచి సర్​ప్రైజ్​..

ఆర్​సీబీ జట్టును తన ఇంటికి ఆహ్వానించినప్పుడు విరాట్​ సర్​ప్రైజ్​ ఇచ్చాడని సిరాజ్​ చెప్పుకొచ్చాడు. "నేను ఓసారి ఆర్​సీబీ జట్టులోని వారందరినీ మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాను. నేను హోటల్​ నుంచి తిన్నగా ఇంటికి వెళ్లిపోయాను. కోహ్లీకి ఫోన్​ చేస్తే ఆరోగ్యం బాలేదు రాలేనని చెప్పాడు. కానీ ఆ తర్వాత అందరితో పాటు తను కూడా వచ్చి సర్​ప్రైజ్​ ఇచ్చాడు. అది నా జీవితంలో బెస్ట్​ సర్​ప్రైజ్​" అంటూ విరాట్​తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు.

ఇదీ చూడండి : "కోహ్లీ.. పాక్​లో సెంచరీ చేస్తే చూడాలని ఉంది"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.