ETV Bharat / sports

ఆ రికార్డుల​పై కన్నేసిన ధోనీ.. మరో 3 సిక్స్​లు కొడితే..

author img

By

Published : Apr 3, 2022, 11:31 AM IST

Dhoni IPL 2022
Dhoni IPL 2022

Dhoni IPL 2022: చెన్నై సూపర్​ కింగ్స్​.. ఈ సీజన్​లో ఆడిన రెండు మ్యాచ్​ల్లో ఓడిపోయింది. బౌలింగ్​ వైఫల్యం.. ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది. ఆదివారం.. పంజాబ్​ కింగ్స్​తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్​లో ధోనీని పలు రికార్డులు ఊరిస్తున్నాయి.

Dhoni IPL 2022: మహేంద్ర సింగ్​ ధోనీ.. ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో బ్యాటింగ్​తో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్​లో కోల్​కతాపై 50, లఖ్​నవూతో ఆఖర్లో వచ్చి 6 బంతుల్లోనే 16 పరుగులతో రాణించాడు. రెండింట్లోనూ అవుట్​ కాకపోవడం విశేషం. కానీ.. చెన్నైని మాత్రం గెలిపించలేకపోయాడు. ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ జట్టు ఓడిపోయింది. సీజన్​ ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు చెన్నై కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోగా.. రవీంద్ర జడేజా కొత్త సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

తొలి గెలుపు కోసం చెన్నై.. ఆదివారం పంజాబ్​తో తలపడనుంది. ముంబయి బ్రబౌర్న్​ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​లో ధోనీని ఓ రికార్డు ఊరిస్తుంది. మరో 3 సిక్స్​లు కొడితే.. టీ-20 క్రికెట్​లోత చెన్నై ఫ్రాంఛైజీ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో తొలి స్థానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం ధోనీ 217 సిక్స్​లతో ఉన్నాడు. ఇందులో 191 ఐపీఎల్​లో చెన్నై తరఫున, మరో 26 ఛాంపియన్స్​ లీగ్​లో కొట్టాడు. రైనా 219 సిక్స్​లతో చెన్నై తరఫున తొలి స్థానంలో ఉన్నాడు.

  • మొత్తంగా చూస్తే ధోనీ టాప్​-5లో ఉన్నాడు.
  • విండీస్​ దిగ్గజం క్రిస్​ గేల్​ 263 సిక్స్​లతో(రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు తరఫున) టాప్​లో ఉన్నాడు.
  • కీరన్​ పొలార్డ్​ 249 సిక్స్​లు(ముంబయి ఇండియన్స్​), ఏబీ డివిలియర్స్​ 240 సిక్సర్లు(రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు), విరాట్​ కోహ్లీ 226 సిక్సర్లు(రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

3 సిక్సర్లు బాదితే.. టీ20 క్రికెట్లో రాస్​ టేలర్​ను కూడా అధిగమించి అత్యధిక సిక్స్​లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో 27వ స్థానానికి చేరుకుంటాడు. ఇప్పటివరకు టీ20ల్లో ధోనీ 349 మ్యాచ్​లు ఆడి.. 307 సిక్స్​లు బాదాడు. మరో మ్యాచ్​ ఆడితే.. 350 టీ20లు ఆడిన అరుదైన ఆటగాళ్ల లిస్ట్​లోకి ప్రవేశిస్తాడు. టీమ్​ఇండియా, ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ.. మొత్తం టీ20ల్లో 371 మ్యాచ్​లు ఆడి లిస్ట్​లో 11వ స్థానంలో ఉన్నాడు. ధోనీ 19వ స్థానానికి చేరుకుంటాడు. భారత్​ నుంచి వీరిద్దరే ఈ జాబితాలో ఉండటం విశేషం.

ఇవీ చూడండి: ఫెంటాస్టిక్​ ఫెర్గూసన్​.. దిల్లీని ఓడించిన గుజరాత్

దిల్లీకి కష్టాలు.. ఆ ముగ్గురి కోసం ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.