ETV Bharat / sports

బిజినెస్​లోనూ ధోనీ నెం.1.. బిగ్గెస్ట్​ ట్యాక్స్​ పేయర్​గా ఘనత!

author img

By

Published : Nov 10, 2022, 11:45 AM IST

Updated : Nov 10, 2022, 12:02 PM IST

Mahendra Singh Dhoni
మహేంద్ర సింగ్ ధోనీ

క్రికెట్ మాజీ సారథి ధోనీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 17 కోట్ల రూపాయలను అడ్వాన్స్ ట్యాక్స్‌ చెల్లించాడు. దీంతో ఝార్ఖండ్​ రాష్ట్రంలోనే అత్యధిక పన్ను చెల్లింపుదారునిగా నిలిచాడు.

.

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ధోనీ పేరు వినని వారుండరు. క్రికెట్​లో తనకంటూ ఓ చరిత్ర లిఖించుకున్న అతడు.. ప్రస్తుతం​ వ్యాపార రేస్​లో దూసుకెళ్తున్నాడు. మంచి బిజినెస్‌మెన్, ఇన్వెస్టర్‌గానూ రాణిస్తున్నాడు. ఆర్గానిక్ ఫామింగ్ కూడా చేస్తున్నాడు. రాంచీలో తన వ్యవసాయ క్షేత్రంలో పండించే పంటలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు! ఇంకా ఎన్నో ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా మహీ.. ఆదాయపన్ను శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో తన రాష్ట్రం ఝార్ఖండ్​ నుంచి అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారునిగా నిలిచాడు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 17 కోట్ల రూపాయలను అడ్వాన్స్ ట్యాక్స్‌ చెల్లించాడు. కాగా, గతేడాది అడ్వాన్స్‌ ట్యాక్స్‌గా రూ.13 కోట్లు జమ చేశాడు. ఇక 2017-18లో రూ. 12.17 కోట్లు, 2016-17లో రూ. 10.93 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాడు.

ఆదాయపు పన్ను శాఖ సమాచారం ప్రకారం, ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఝార్ఖండ్‌లో వ్యక్తిగత విభాగంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారునిగానే ఉన్నాడు. క్రికెట్ నుంచి రిటైరయిన తర్వాత మాత్రం చాలా కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. స్పోర్ట్స్ వేర్, హోమ్ ఇంటీరియర్ కంపెనీ, బైక్ రేసింగ్ కంపెనీ.... ఇలా చాలా కంపెనీలలో పెట్టుబడులను పెట్టాడు. 'సెవెన్' పేరుతో సొంత ఫుట్​వేర్ కంపెనీను కూడా ప్రారంభించాడు.

అయితే ధోనీ అత్యధిక ఆదాయ పన్ను చెల్లించడంపై ఝార్ఖండ్​ ఆర్థిక మంత్రి ఓరన్​ స్పందించారు. "ఆదాయపు పన్ను వసూలు చేసే దానిలో రాష్ట్రానికి 41శాతం వస్తుంది. అయితే రాష్ట్రంలోని పేద ప్రజల అభ్యున్నతి కోసం ధోనీ తన డబ్బును ఉపయోగిస్తే మంచిది. యువత విద్యావంతులైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దీంతో దేశం కూడా అభివృద్ధి చెందుతుంది" అని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:గోవా బీచ్​లో సచిన్ సందడి.. మత్స్యకారులతో కలిసి చేపలు పడుతూ..

T20 Worldcup: ఇంగ్లాండ్‌తో భారత్‌ సెమీస్‌ పోరు నేడే.. ఫైనల్​కు వెళ్లేది ఎవరో?

Last Updated :Nov 10, 2022, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.