ETV Bharat / sports

పాండ్యతో గొడవ.. రాష్ట్ర జట్టుకు దీపక్​ వీడ్కోలు

author img

By

Published : Jul 15, 2021, 9:07 PM IST

Updated : Jul 16, 2021, 6:51 PM IST

deepak hooda
దీపక్​ హోడా

దేశవాళీ క్రికెట్​లో సుదీర్ఘకాలంగా బరోడా జట్టుకు ఆడుతున్న క్రికెటర్​ దీపక్​ హోడా(Deepak Hooda) ఆ టీమ్​కు వీడ్కోలు పలికాడు . బరోడా క్రికెట్​ అసోసియేషన్​ నుంచి నిరభ్యంతర పత్రము కూడా తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఆ జట్టు సారథి కృనాల్​ పాండ్యతో జరిగిన వివాదమే ఇందుకు కారణం.

టీమ్​ఇండియా క్రికెటర్​ దీపక్​ హోడా(Deepak Hooda) కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘకాలంగా దేశవాళీ క్రికెట్​లో బరోడా జట్టుకు ఆడుతున్న అతడు, టీమ్​కు వీడ్కోలు పలికాడు. బరోడా క్రికెట్​ అసోసియేషన్​ నుంచి నిరభ్యంతర పత్రం కూడా తీసుకున్నాడు. వచ్చే సీజన్​లో రాజస్థాన్​ తరఫున ఆడనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని అతడే ప్రకటించాడు.

"సుదీర్ఘకాలంగా ఆడిన బరోడా జట్టును వీడడం బాధగా ఉంది. కానీ ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నాను. నా కోచ్​లు శ్రయోభిలాషులుతో కూడా ఈ విషయమై చర్చించాను" అని హోడా అన్నాడు.

ఇదీ జరిగింది

ఈ ఏడాది జనవరిలో 'సయ్యద్ ముస్తాక్ అలీ టీ20' సమయంలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని బరోడా సారథి కృనాల్​ పాండ్యపై(Krunal Pandya) దీపక్​ హుడా ఆరోపణలు చేశాడు. అప్పుడు మ్యాచ్​లు కూడా ఆడకుండానే బయోబబుల్​ నుంచి బయటకొచ్చేశాడు. దీంతో అతడిపై ఏడాది పాటు యాజమాన్యం నిషేధం విధించింది.

అనంతరం కృనాల్​ పాండ్యతో జరిగిన వివాదం వల్ల ఒత్తిడి, నిరాశకు గురైనట్లు వివరణ ఇచ్చాడు హోడా. అందుకే తాను జట్టు నుంచి వీడినట్లు బీసీఏ సెక్రటరీ అజిత్​ లేలేకు లేఖ రాశాడు. ఈ క్రమంలోనే అతడు జట్టుకు వీడ్కోలు పలికాడు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న బోర్డు ఇప్పుడు అతడికి అభ్యంతర పత్రాన్ని ఇచ్చింది."అతడికి అభ్యంతర పత్రము ఇచ్చాము. బరోడా జట్టుకు అతడు వీడ్కోలు పలకడం దురదృష్టకరం. జరిగన గొడవను హోడా, కృనాల్​ సరైన రీతిలో పరిష్కరించుకుంటారని భావిస్తున్నాను." అని లేలే అన్నారు.

2013నుంచి బరోడా తరఫున హోడా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 46ఫస్ట్​ క్లాస్​ మ్యాచ్​లు(2,908 పరుగులు, 20 వికెట్లు), 68లిస్ట్​-ఏ మ్యాచ్​లు(2,059, 34) ఆడాడు.

ఇదీ చూడండి: పాండ్యతో గొడవ.. టోర్నీ నుంచి తప్పుకున్న హుడా

Last Updated :Jul 16, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.