ETV Bharat / sports

కష్టసమయంలో వారు నాకు అండగా నిలిచారు: క్రికెటర్ దీపక్​ హుడా

author img

By

Published : Jan 31, 2022, 7:29 AM IST

deepak hooda
దీపక్​ హుడా

Deepak Hooda Irfan pathan: కష్ట సమయంలో పఠాన్​ సోదరులు తనకు అండగా నిలిచారని, వారికి కృతజ్ఞతలు చెప్పాడు టీమ్​ఇండియా ప్లేయర్​ దీపక్​ హుడా. ఆటగాడిగా సిద్ధం కావడానికి వారిద్దరూ తనకు ఎంతో సహకరించారని అన్నాడు.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన టీమ్‌ఇండియా ఆటగాడు దీపక్‌ హుడా.. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన పఠాన్‌ సోదరులకు కృతజ్ఞతలు చెప్పాడు. విజయ్‌ హజారే, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలలో అద్భుత ప్రదర్శన చేయడంతో మళ్లీ వన్డే జట్టులోకి వచ్చే అవకాశం దీపక్‌కు వచ్చింది. గతంలో శ్రీలంకతో నిదహాస్ ట్రోఫీ జట్టులోనూ సభ్యుడైనప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేకపోయాడు.

"నేను టీమ్‌ఇండియాకు ఎంపిక కావడంపై చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. తుది జట్టులో ఆడతానో లేదో కూడా తెలియదు. అయితే ఇర్ఫాన్‌ ఒకటే మాట చెప్పాడు. వేచి చూస్తూ ఉండు సమయం అదే వస్తుంది. నేను ఇర్ఫాన్, యూసఫ్‌ నుంచి చాలా విషయాలను తెలుసుకున్నా. ప్రశాంతంగా ఉండాలని వారిద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నా. అయితే యువకుడిగా అలా ఉండటం కష్టమైంది. ప్రశాంతంగా ఉండలేకపోవడం కూడా నా ఆటకు ఆటంకం కలిగించింది. అందుకే దానికోసం చాలా కష్టపడ్డా" అని దీపక్‌ హుడా వివరించాడు.

ఆటగాడిగా సన్నద్ధత కావడానికి ఇర్ఫాన్ పఠాన్‌ తనకు ఎంతో సహకరించాడని దీపక్ తెలిపాడు. నిజాయితీని ప్రదర్శించడంలో సహాయపడిందని పేర్కొన్నాడు. "నేను తప్పకుండా ఇర్ఫాన్‌ భాయ్‌ను గుర్తుకు తెచ్చుకోవాలి. సన్నద్దత ఎంత ముఖ్యమో చాలా చక్కగా చెప్పాడు. వేరేవారి నుంచి ఏమీ ఆశించకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. అది జిమ్ అయినా.. సాధన సెషన్స్‌లోనైనా సరే కష్టపడి పని చేయడమే నేర్చుకున్నా. దానికి తగ్గ ఫలితం ఇప్పుడొచ్చింది" అని దీపక్‌ హుడా ఆనందం వ్యక్తం చేశాడు.

బరోడాకు ఆడుతున్నప్పుడు ఎత్తుపల్లాలను అనుభవించానని, అలానే వేరే రాష్ట్రానికి (రాజస్థాన్‌) మారినప్పుడు కూడా వారిద్దరూ ఎంతో సపోర్ట్‌గా నిలిచారన్నాడు దీపక్​. అలానే పంజాబ్‌ కింగ్స్‌ ప్రధాన కోచ్ అనిల్‌ కుంబ్లేకీ ధన్యవాదాలు తెలిపాడు. తన మీద నమ్మకంతో రెండు సీజన్లలో అవకాశం కల్పించడంలో కుంబ్లే కీలక పాత్ర పోషించాడని వెల్లడించాడు. దీపక్ హుడా గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కూ ఆడాడు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

'క్లే కోర్టు' కింగ్‌ రఫెల్‌ నాదల్‌.. 21 ఏళ్లు.. 21 గ్రాండ్‌స్లామ్‌లతో రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.