ETV Bharat / sports

టీమ్​ఇండియా నయా 'స్వింగ్ క్వీన్'.. బరిలో దిగితే ప్రత్యర్థులు పెవిలియన్‌కే..

author img

By

Published : Aug 4, 2022, 5:52 PM IST

cwg2022-renuka-singh-sensational-bowling
cwg2022-renuka-singh-sensational-bowling

కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడుతున్న భారత మహిళల క్రికెట్​ జట్టు బౌలర్​ రేణుకా సింగ్ ఠాకూర్.. తన సూపర్ ఫామ్​తో ఆకట్టుకుంటోంది. హిమాచల్‌ ప్రదేశ్​కు చెందిన ఈ ప్లేయర్ టీమ్​ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యర్థి బ్యాటర్లకు అర్థంకాని పజిల్‌‌గా మారి, వికెట్లను తన ఖాతాలో వేసుకుంటుంది. దీంతో సోషల్‌ మీడియాలో భువనేశ్వర్‌తో పోలుస్తూ అభిమానులు నయా 'స్వింగ్‌ క్వీన్‌' అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఓ సారి ఆమె సెన్సేషనల్​ బౌలింగ్​ వీడియోలను చూద్దాం రండి.

Common Wealth Games 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. కీలకపోరులో బార్బడోస్‌ను చిత్తు చేసింది. పాకిస్థాన్‌ను బెంబేలెత్తించింది. ఆస్ట్రేలియాకు చెమటలు పట్టించింది. అయితే, ఇవన్నీ జరిగాయంటే ప్రధాన కారణం మాత్రం... రేణుకా సింగ్‌ ఠాకూర్‌. ఎందుకంటే ఆమె ఈ టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్ (9), భారత్‌కు పవర్‌ప్లేలో గేమ్ ఛేంజర్.

తొలి మ్యాచ్‌లో భారత్‌ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినా..రేణుకా సింగ్‌ బౌలింగ్‌ మాత్రం అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే అలిస్సా హీలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్‌, తహ్లియా మెక్‌గ్రాత్ ఇలా అగ్రశ్రేణి బ్యాటర్లను పెవిలియన్‌కు పంపింది. ఇక రెండో మ్యాచ్‌లో పాక్‌పై పొదుపు బౌలింగ్ చేసి కట్టడి చేసింది. భారత్‌కు చావోరేవో తేల్చుకోవాల్పిన మ్యాచ్‌లో బార్బడోస్‌ బ్యాటర్లను చుట్టేసింది. పవర్‌ప్లేలో 3 ఓవర్లు వేసి కేవలం ఐదు పరుగులు ఇచ్చి మూడు కీలకవికెట్లు పడగొట్టింది.

cwg2022-renuka-singh-sensational-bowling
రేణుకా సింగ్​

కామన్వెల్త్ గేమ్స్‌లో రేణుకా ప్రదర్శన

  • 4-0-18-4 (ఆస్ట్రేలియా పై)
  • 4-1-20-1 (పాకిస్థాన్‌పై)
  • 4-0-10-4 (బార్బడోస్‌)

కామన్వెల్త్‌ గేమ్స్‌లో మొత్తంగా 12 ఓవర్లు వేసిన రేణుక 5.33 సగటు, 4.00 ఎకానమీతో 9 వికెట్లు తీయడం విశేషం.

స్వింగ్‌ క్వీన్‌
రేణుకా సింగ్‌ ఈ టోర్నీలో తన స్వింగ్‌ డిలివిరీలతో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తోంది. ఆసీస్‌పై తహ్లియా మెక్‌గ్రాత్ లాంటి బ్యాటర్‌నే ఇన్‌స్వింగ్‌తో బుట్టులో వేసుకొంది. ఇక బార్బడోస్‌పై ప్రతి బంతిని స్వింగ్ చేస్తూ పవర్‌ప్లే బ్యాటర్లకు సవాల్‌ విసిరింది. దీంతో సోషల్‌ మీడియాలో భువనేశ్వర్‌తో పోలుస్తూ అభిమానులు స్వింగ్‌ క్వీన్‌ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

బెస్ట్‌ ఫీమేల్ క్రికెటర్‌!
ఐసీసీ జులై నెలకు నామినేట్‌ చేసిన బెస్ట్‌ ఉమెన్‌ క్రికెటర్‌ రేసులో రేణూ ఉంది. ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఎమ్మా లాంబ్‌ (234 పరుగులు), నటలియా స్కావర్‌ (219 రన్స్‌, 5 వికెట్లు)తో రేణూ (12 వికెట్లు) పోటీపడుతోంది. రేణుకా సెమీస్‌లో మళ్లీ విజృంభించి భారత్‌కు పతకం ఖాయం చేస్తుందేమో చూడాలి!

ఇదీ చదవండి: womens cricket: సెమీస్​కు దూసుకెళ్లిన టీమ్​ఇండియా.. బార్బడోస్​పై భారీ విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.