ETV Bharat / sports

'ఐపీఎల్​లో భద్రత పరంగా భయాలేవీ లేవు'

author img

By

Published : Sep 6, 2020, 4:06 PM IST

Pat Cummins
పాట్​ కమ్మిన్స్

యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్​లో భద్రతా ప్రమాణాల విషయంలో ఎటువంటి భయాలు లేవని కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు ఆటగాడు ప్యాట్ కమిన్స్ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టీ20 సిరీస్​లో ఆడుతున్నాడు కమిన్స్.

ఆస్ట్రేలియా వైస్​ కెప్టెన్​ ప్యాట్ కమిన్స్​ ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరిగే టీ20, వన్డే సిరీస్​లో ఆడుతున్నాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయోసెక్యూర్​ విధానంలో మ్యాచ్​ను నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 16న ఇంగ్లాండ్​ పర్యటన ముగియనుంది. అనంతరం.. కమిన్స్​ నేరుగా ఐపీఎల్​ కోసం యూఏఈ చేరుకోనున్నాడు. కోల్​కతా నైట్​ రైడర్స్ తరఫున ఈ లీగ్​లో అలరించనున్నాడు ఈ సందర్భంగా తన లాంగ్​ షెడ్యూల్​పై స్పందిస్తూ.. ఇది మానసికంగా పెద్ద సవాలని పేర్కొన్నాడు.

"కచ్చితంగా ఈ విషయంలో మానసిక సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పర్యటనతో పాటు ఐపీఎల్​ వంటి టోర్నీల మధ్య కుటుంబాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే, అన్నింటికీ మీరు సిద్ధంగా ఉండాలి. ఆటపై దృష్టి కేంద్రీకరించేందుకు ప్రణాళికలు రచించుకోవాలి."

-ప్యాట్ కమిన్స్​, ఆసీస్​ వైస్​ కెప్టెన్​

కమిన్స్​ను కేకేఆర్​ రూ.15.5 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్​ చరిత్రలో అత్యంత ఖరీదైన వీదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే యూఏఈలో జరిగే ఐపీఎల్​లో భద్రత ప్రమాణాల విషయంపై స్పందిస్తూ.. అందులో ఎటువంటి భయాలు లేవని కమిన్స్ స్పష్టం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.