ETV Bharat / sports

గంగూలీకి కరోనా పరీక్షల్లో నెగటివ్

author img

By

Published : Jul 25, 2020, 7:59 PM IST

గంగూలీకి కరోనా పరీక్షల్లో నెగటివ్
గంగూలీకి కరోనా పరీక్షల్లో నెగటివ్

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి కరోనా నెగటివ్​గా తేలింది. కొద్దిరోజుల క్రితం తన సోదరుడు స్నేహాశీష్​కు పాజిటివ్​ రావడం వల్ల దాదా హోమ్ క్వారంటైన్​లో ఉంటున్నారు.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కొద్దిరోజులుగా హోమ్ క్వారంటైన్​లో ఉంటున్నారు. తన సోదరుడు స్నేహాశిష్​కు కరోనా పాజిటివ్​ రావడం వల్ల దాదా క్వారంటైన్​లో ఉండాల్సి వచ్చింది. అయితే తాజాగా చేయించుకున్న పరీక్షల్లో గంగూలీకి నెగటివ్​గా తేలింది.

ప్రస్తుతం బంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న స్నేహాశిష్ కుటుంబం కూడా కరోనా నుంచి కోలుకుంటోంది. కొన్నిరోజుల క్రితం తన భార్య, అత్తమామలకు కరోనా పాజిటివ్​ రావడం వల్ల స్నేహాశిష్, గంగూలీ ఉంటున్న ఇంట్లోకి మారారు. అయితే గత నెలలోనే స్నేహాశిష్​కు కరోనా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లేనని, తాను ఆరోగ్యంగా ఉన్నట్లు అప్పుడు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.