ETV Bharat / sports

అంబటి రాయుడు ఇంట్లో శుభవార్త

author img

By

Published : Jul 12, 2020, 6:53 AM IST

Ambati Rayudu is good news at home .. He is father
అంబటి రాయుడు

టీమిండియా క్రికెటర్​ అంబటి రాయుడు తండ్రయ్యాడు. దీంతో అతని ఇంట్లో పండగ వాాతావరణం నెలకొంది.

భారత క్రికెటర్​ అంబటి రాయుడు తండ్రయ్యాడు. అతని భార్య విద్య ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దంపతులకు ఇదే తొలి సంతానం. దీంతో రాయుడు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. గతేడాది వన్డే ప్రపంచకప్​కు ఎంపిక కాకపోవడం వల్ల నిరాశకు లోనై ఆటకు రిటైర్మెంట్​ ప్రకటించాడు రాయుడు.

ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో రాయుడు చెన్నై సూపర్​ కింగ్స్​ తరఫున ఆడుతున్నాడు.

ఇదీ చూడండి : అద్భుత ప్రపంచం 'డిస్నీ వరల్డ్'​ పునఃప్రారంభం.. కానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.