ETV Bharat / sports

2024లో బిగ్గెస్ట్​ స్పోర్ట్స్ ఈవెంట్స్ - ఐసీసీ నుంచి ఆ రెండు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 9:34 AM IST

Biggest Sport Events in 2024 : గ‌డ‌చిన 2023 ఎన్నో తీపి, చేదు జ్ఞాప‌కాల్ని మిగిల్చింది. స్పోర్ట్స్ విష‌యానికి వ‌స్తే న‌వంబ‌రులో వ‌ర‌ల్డ్ క‌ప్ ఓట‌మిని కొంత‌మంది ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేదు. అయితే ఈ ఏడాదీ కొన్ని బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్నాయి. అవేంటంటే ?

Biggest Sport Events in 2024
Biggest Sport Events in 2024

Biggest Sport Events in 2024: స్పోర్ట్స్ ప‌రంగా 2023 కొంద‌రికి మ‌ధుర‌, మ‌రికొంద‌రికి చేదు జ్ఞాప‌కాల్ని మిగిల్చింది. 2023లో వ‌న్డే క్రికెట్ వ‌రల్డ్ క‌ప్, ర‌గ్బీ వ‌ర‌ల్డ్ క‌ప్, ఫిఫా మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ లాంటి గ్రాండ్ ఈవెంట్స్​ జ‌రిగాయి. అయితే వీటిల్లో మ‌న భారత్​లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ నిరాశ‌ను మిగిల్చింది. మరీ ఈ ఏడాది సైతం కొన్ని పెద్ద స్పోర్ట్ ఈవెంట్స్ జ‌ర‌గ‌నున్నాయి. అవేంటంటే ?

1. ఒలింపిక్స్ (పారిస్)
సాధారణంగా బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తొచ్చేది ఒలింపిక్సే. ఈ మెగా ఈవెంట్ జ‌రుగుతోందంటే ఇక అంద‌రిక క‌ళ్లు దానిపైనే ఉంటాయి. ఇది జ‌రిగిన‌న్ని రోజులు అతిథ్య దేశం పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా వార్త‌ల్లో నానుతూనే ఉంటుంది. ప్ర‌తి నాలుగేళ్ల‌కోసారి ఒలింపిక్స్ జ‌రుగుతుంటాయి. దాదాపు 40 విభాగాల్లో పోటీలుంటాయి. అంత‌టి ప్రాముఖ్య క‌లిగిన ఒలింపిక్స్ ఈ ఏడాది ఫ్రాన్స్​లో జ‌ర‌గ‌నుంది. జులై 26 నుంచి ఆగ‌స్టు 11 వ‌ర‌కు రాజ‌ధాని న‌గరం పారిస్​లో జ‌రుగుతాయి.

2. ఐసీసీ మెన్స్ టీ-20 ప్ర‌పంచ క‌ప్
అంత‌ర్జాతీయ క్రికెట్ అభిమానులు అత్యంత ఆస‌క్తితో ఎదురు చూసే ఐసీసీ మెన్స్ టీ-20 ప్ర‌పంచ క‌ప్ కూడా ఈ ఏడాదే జ‌ర‌గ‌నుంది. మొట్ట మొద‌టిసారిగా ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీకి అమెరికా ఆతిథ్యం ఇవ్వ‌నుంది. అమెరికాతో పాటు వెస్టిండీస్ మ్యాచుల‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ టోర్నీ జూన్ 1 న ప్రారంభ‌మై 29న ముగుస్తుంది. ఇక ఇండియా - పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్ జూన్ 9 న జ‌రుగుతుంది.

3.UEFA (యూరోపియ‌న్ ఫుట్ బాల్ ఛాంపియ‌న్ షిప్)
ఫిఫా త‌ర్వాత అంత‌టి ప్రాముఖ్యం క‌లిగిన ఆట‌గా Union of European Football Associations (UEFA) యూరోపియ‌న్ ఫుట్ బాల్ ఛాంపియ‌న్​షిప్ పేరొందింది. ఈ టోర్న‌మెంట్ లో UEFA కి చెందిన ఆయా దేశాల మెన్స్ టీమ్ ఆడుతుంది. ఇందులో గెలిచిన వారు యూర‌ప్ ఛాంపియ‌న్స్ గా నిలుస్తారు. దీన్ని 1960 నుంచి ప్ర‌తి నాలుగేళ్ల‌కోసారి నిర్వ‌హిస్తారు. కానీ 2020 లో క‌రోనా కార‌ణంగా వాయిదా వేశారు. యూరో 2012 ఫైనల్‌ను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 మిలియన్ల మంది ప్రేక్షకులు వీక్షించారు. ఈ ఏడాది ఇది జర్మ‌న్ వేదిక‌గా 14 జూన్ నుంచి 14 జులై వ‌ర‌కు నెల రోజుల పాటు జ‌ర‌గ‌నుంది.

4. AFC ఆసియా కప్
AFC ఆసియా కప్ అనేది ఆసియా ఖండంలో ఉండే మేజ‌ర్ ఫుట్ బాల్ టోర్న‌మెంట్. ఇందులో.. ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ స‌భ్య‌త్వం క‌లిగిన దేశాల జ‌ట్లు పాల్గొంటాయి. విజ‌యం సాధించిన వారు.. ఆసియా ఖండపు విజేత అవుతారు. ఇది 1956 నుంచి ప్ర‌తి నాలుగేళ్ల‌కోసారి జ‌రుగుతుంది.

5. ఐసీసీ విమెన్స్ టీ-20 ప్ర‌పంచ క‌ప్
విమెన్స్ టీ-20 ప్ర‌పంచ క‌ప్ కూడా ఈ ఏడాదే ఉంది. బంగ్లాదేశ్ వేదిక‌గా ఈ టోర్నీ జ‌రగ‌నుంది. సెప్టెంబ‌రులో ప్రారంభ‌మై అక్టోబ‌రులో ముగుస్తుంది. 10 జ‌ట్లు పాల్గొనే ఈ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు 8 జ‌ట్లు అర్హ‌త సాధించాయి. హోస్ట్ బంగ్లాదేశ్ తో పాటు డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్, పాకిస్థాన్ లు క్వాలిఫై అయ్యారు. మ‌రో జ‌ట్లు ఇత‌ర రెండు స్థానాల కోసం పోటీ పడాల్సి ఉంటుంది.

2024లో టోర్నీలే టోర్నీలు- క్రికెట్​ ఫ్యాన్స్​కు ఫుల్ పండుగ- కంప్లీట్ ఇయర్ షెడ్యూల్ ఇదే!

టీ20 వరల్డ్​కప్ షెడ్యూల్ ఔట్​ - భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.