ETV Bharat / sports

టీ20 వరల్డ్​కప్ లోగో రిలీజ్ - బ్యాట్ బాల్, ఎనర్జీ అంటూ ఇంట్రెస్టింగ్ వీడియో ఔట్

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 11:00 PM IST

2024 T20 World Cup Logo : 2024 టీ20 వరల్డ్​కప్​కు సంబంధించి ఐసీసీ గురువారం లోగోలు రిలీజ్ చేసింది.

2024 t20 world cup logo
2024 t20 world cup logo

2024 T20 World Cup Logo : 2024 టీ20 వరల్డ్​కప్ టోర్నమెంట్​కు సంబంధించి ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) కొత్త లోగోను గురువారం విడుదల చేసింది. 2024 జూన్​లో పురుషుల, సెప్టెంబర్-అక్టోబర్ మధ్య మహిళల టీ20 వరల్డ్​కప్ జరగనుంది. ఈ క్రమంలో పురుషుల, మహిళల టోర్నీ లోగోలను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఐసీసీ మార్కెటింగ్‌ అండ్ కమ్యూనికేషన్స్‌ జీఎం క్లైయిర్‌ ఫర్లాంగ్ స్పందించారు.'అంతర్జాతీయంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి పురుషుల, మహిళల ప్రపంచ కప్‌లు సిద్ధమవుతున్నాయి. కొత్తగా ఆవిష్కరించిన లోగోలు ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాం' అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

2024 ICC Men's T20 World Cup Host : 2024 వరల్డ్​కప్ సంబరం మరో ఆరు నెలల్లో ప్రారంభం కానుంది. టోర్నీలో జూన్ 4 నుంచి 30 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్​ కోసం ఆయా జట్ల ఇప్పటికే సన్నద్ధత ప్రారంభించాయి. ఇక ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి యూఎస్, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక టోర్నీలో ఈ ఎడిషన్​లో 20 జట్లు తలపడనున్నాయి. ఈ 20 జట్లను 5 గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్​లు నిర్వహించనున్నారు.

2024 T20 World Cup India : గత 13 ఏళ్లుగా ఐసీసీ టోర్నమెంట్​లో ఛాంపియన్​గా నిలవని టీమ్ఇండియా, పొట్టి కప్పును సీరియస్​గా తీసుకుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటినుంచే జట్టలో కీలక మార్పులకు సిద్ధమైంది బీసీసీఐ. అయితే 2024 టీ20 వరల్డ్​కప్​నకు కూడా రోహిత్ శర్మనే కెప్టెన్​గా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఈసారి జట్టులో కుర్రళ్లకు పెద్ద పీట వేయాలని మేనేజ్​మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ముడో స్థానంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను ఆడించాలని అనుకుంటుందట. ఇషాన్​ కెరీర్​లో ఇప్పటివరకు 32 టీ20 మ్యాచ్​లు ఆడాడు. అందులో 124.37 స్ట్రైక్ రేట్​తో 796 పరుగులు చేశాడు. దీంతో ఇషాన్ 2024 వరల్డ్​కప్​లో మూడో స్థానంలో కీ రోల్​ ప్లే చేస్తాడని మేనేజ్​మెంట్ భావిస్తోందట. కానీ, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

'నడవలేని స్థితి వరకు ఐపీఎల్‌ ఆడతా- ఏ ఆటగాడైనా కోరుకునే గొప్ప అనుభూతి అదే!'

బిష్ణోయ్ కెరీర్ బెస్ట్ పొజిషన్ - తొలిసారి టాప్​ ప్లేస్​కు - టీ20 ర్యాంకింగ్స్ రిలీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.