ETV Bharat / sitara

New movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

author img

By

Published : Aug 30, 2021, 11:18 AM IST

tollywood news, టాలీవుడ్​ వార్తలు
Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

గత నెల రోజులుగా థియేటర్లలో సినిమాలు సందడి చేస్తున్నాయి. చిన్న బడ్జెట్​ సినిమాలదే హవా. ఇదే ట్రెండ్​ సెప్టెంబరులో కూడా కొనసాగనుంది. మొదటి వారంలో విడుదల కానున్న ఆ సినిమాలు (New movies) ఏంటో తెలుసా?

కరోనా పరిస్థితులను దాటుకొని తెలుగు తెరపై చిన్న చిత్రాల సందడి కొనసాగుతోంది. థియేటర్లు ప్రారంభించి దాదాపు నెలరోజులు దాటింది. ఇప్పటివరకు యువ కథానాయకులు, చిన్న బడ్జెట్‌ సినిమాలే వెండితెరపై సందడి చేశాయి. ఈ పరంపర సెప్టెంబరులోనూ కొనసాగనుంది. మరోవైపు కొన్ని చిత్రాలు ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి సెప్టెంబరు మొదటి వారంలో థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలేవో (New movies) చూసేయండి.

'101 జిల్లాల అందగాడు..' కానీ అసలు సమస్య అదే!

వైవిధ్య కథలు, పాత్రలతో అలరించే యువ నటుల్లో అవసరాల శ్రీనివాస్‌ ఒకరు. తాజాగా ఆయన బట్టతలతో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం '101 జిల్లాల అందగాడు'. రుహానీ శర్మ కథానాయిక. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 3న థియేటర్‌లలో విడుదల కానుంది.

tollywood news, టాలీవుడ్​ వార్తలు
'నూటొక్క జిల్లాల అందగాడు'
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. పెళ్లికాక ముందే బట్టతల రావడం వల్ల అది కనిపించకుండా గొత్తి సత్యనారాయణ అనే యువకుడు విగ్గు పెట్టుకుంటాడు. అది చూసి అందరూ అతడిది నిజమైన జుట్టు అనుకుంటారు. ఒక అమ్మాయి కూడా ప్రేమలో పడుతుంది. బట్టతల కనపడనీయకుండా చేసేందుకు సత్యనారాయణ చేసిన ప్రయత్నాలు ఏంటి? తెలిసిన తర్వాత ఆ అమ్మాయి అతడిని ప్రేమించిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. దిల్‌రాజు, జాగర్లమూడి క్రిష్‌ సమర్పిస్తున్నారు.

డియర్‌ ప్రేమకథ

మేఘా ఆకాష్‌, అరుణ్‌ అదిత్‌, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'డియర్‌ మేఘ'. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. అర్జున్‌ దాస్యన్‌ నిర్మించారు. భావోద్వేగాలే ప్రధానంగా రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

tollywood news, టాలీవుడ్​ వార్తలు
'డియర్​ మేఘ'
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అనుభూతికి గురిచేసే ఓ మంచి ప్రేమకథతో ఈ చిత్రం రూపొందిందని, ప్రతి ఒక్కరినీ హత్తుకునేలా భావోద్వేగాలు ఉంటాయని నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభించింది. 300 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. హరి గౌర ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

వినోదాత్మక చిత్రం 'అప్పుడు ఇప్పుడు'

tollywood news, టాలీవుడ్​ వార్తలు
'అప్పుడు ఇప్పుడు'

సుజన్‌, తనీష్క్‌ జంటగా చలపతి పువ్వల తెరకెక్కించిన చిత్రం 'అప్పుడు ఇప్పుడు'. ఉషారాణి కనుమూరి, విజయ్‌ రామ కృష్ణంరాజు నిర్మించారు. శివాజీ రాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సెప్టెంబరు 3న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ చక్కటి వినోదాత్మక చిత్రమిదని, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని దర్శకుడు చలపతి తెలిపారు.

క్రైమ్‌ థ్రిల్లర్‌ ఈ 'కిల్లర్‌'

tollywood news, టాలీవుడ్​ వార్తలు
'కిల్లర్'​ పోస్టర్

కార్తీక్‌ సాయి, డాలీ షా, నేహా దేశ్‌పాండే కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ది కిల్లర్‌'. చిన్నా దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబరు 3న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాదవ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై ఆవుల రాజు యాదవ్‌, సంకినేని వాసుదేవరావు నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్‌ వాట్కిన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

'అశ్మీ' కథ ఏంటి?

ఓ ప్రొఫెసర్‌ అమ్మాయిని అపహరిస్తాడు. చిత్ర హింసలకు గురి చేస్తాడు. అతడి బారి నుంచి ఆ అమ్మాయి ఎలాగో తప్పించుకుంటుంది. ఆ రాక్షసుడి బారి నుంచి బయట పడిన అమ్మాయి వాడిని ఎలా గుర్తించింది? అతడిపై ఎలా పగతీర్చుకుంది? తెలియాలంటే 'అశ్మీ' చూడాల్సిందే.

tollywood news, టాలీవుడ్​ వార్తలు
'అశ్మీ'

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కూడా సెప్టెంబరు 3న థియేటర్‌లలో విడుదల కానుంది. రుషికా రాజ్‌, రాజ నరేంద్ర, కేశవ్‌ దీపకప్‌, ఇందు కుసుమ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శేష్‌ కార్తికేయ దర్శకత్వం వహించారు.

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌-9

ప్రపంచవ్యాప్తంగా యాక్షన్‌ ప్రియులను అలరించే చిత్రాల్లో 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' సిరీస్‌ ఒకటి. ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటివరకు ఎనిమిది చిత్రాలు విడుదలై సందడి చేయగా.. 9వ చిత్రం 'ఎఫ్‌9' త్వరలో భారతీయ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

tollywood news, టాలీవుడ్​ వార్తలు
'ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్ 9'
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇప్పటికే అంతర్జాతీయంగా విడుదలైన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. విన్‌ డీజిల్‌, మిచెల్లీ రోడ్రిగోజ్‌, టైర్సీ గిబ్సన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సెప్టెంబరు 3న ఇంగ్లీష్‌, హిందీతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. జస్టిన్‌ లిన్‌ దర్శకత్వం వహించారు.

ఓటీటీలో రాబోతున్న చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • స్పార్కింగ్‌ జాయ్‌ (ఆగస్టు 31)
  • గుడ్‌ గర్ల్స్‌ (ఆగస్టు 31)
  • మనీ హెయిస్ట్‌-సీజన్‌5 (సెప్టెంబరు 3)

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

  • బ్లాక్‌ విడో (సెప్టెంబరు 3)

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • సిండ్రెల్లా (సెప్టెంబరు 3)

జీ5

  • హెల్మెట్‌ (సెప్టెంబరు 3)

హెచ్‌బీవో మ్యాక్స్‌

  • రెమినిసెన్స్‌ (సెప్టెంబరు 3)

ఇదీ చూడండి : ఆ సినిమాలు చెప్పిన తేదీకే రిలీజ్ చేస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.