ETV Bharat / sitara

టాలీవుడ్​ నుంచి న్యూఇయర్​ అప్​డేట్స్​!

author img

By

Published : Jan 1, 2021, 7:17 PM IST

Tollywood Movie Updates released For the occasion of new year
టాలీవుడ్​ నుంచి న్యూఇయర్​ అప్​డేట్స్​!

టాలీవుడ్​ కొత్త సినిమాల అప్​డేట్స్​ వచ్చేశాయి. నూతన సంవత్సరం సందర్భంగా ప్రేక్షకులను శుభాకాంక్షలు తెలుపుతూ.. పలు సినిమాల ఫస్ట్​లుక్​లను చిత్రబృందాలు విడుదల చేశాయి.

  • నితిన్​, కీర్తీ సురేశ్​ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'రంగ్​దే'. ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • విభిన్న చిత్రాల దర్శకుడు గుణశేఖర్​ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న చిత్రం 'శాకుంతం'. ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్​ గతేడాదే ప్రకటించారు. ఇందులోని ప్రధానపాత్రకు చిత్రబృందం సమంతను ఎంపికచేసింది. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • కన్నడ హీరో ధ్రువ​ సర్జా హీరోగా తెరకెక్కిన చిత్రం 'పొగరు'. అదే పేరుతో తెలుగులో డబ్​ చేసి త్వరలోనే విడుదల చేయనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆ సినిమాలోని డైలాగ్​ ట్రైలర్​ను చిత్రబృందం రిలీజ్​ చేసింది.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • మెగాస్టార్​ చిరంజీవి అల్లుడు కల్యాణ్​ దేవ్​ నటిస్తోన్న కొత్త చిత్రం 'కిన్నెరసాని'. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​ గ్లింపైజ్​ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు రామ్​ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • 'కలర్​ ఫొటో' చిత్రంతో కథానాయకుడిగా మారిన హస్యనటుడు సుహాస్​ ప్రధానపాత్రగా మరో సినిమా రూపొందనుంది. 'రైటర్​. పద్మభూషణ్​' అనే టైటిల్​తో తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్​ వర్క్​ పూర్తవ్వగా.. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
    Tollywood Movie Updates released For the occasion of new year
    'రైటర్​ పద్మభూషణ్​' ఫస్ట్​లుక్​
  • యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'లక్ష్య'. ఆర్చర్​ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్​ తుదిదశకు చేరుకుంది. నాగశౌర్య ప్రస్తుతం 'వరుడు కావలెను' చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.
    Tollywood Movie Updates released For the occasion of new year
    'లక్ష్య' న్యూఇయర్​ పోస్టర్​
  • 'ఆర్​ఎక్స్​ 100' దర్శకుడు అజయ్​ భూపతి రూపొందిస్తున్న చిత్రం 'మహా సముద్రం'. ఇందులో హీరో శర్వానంద్​, సిద్ధార్థ్​లు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకొంటోంది.
    Tollywood Movie Updates released For the occasion of new year
    'మహాసముద్రం' చిత్రీకరణ
    Tollywood Movie Updates released For the occasion of new year
    'మహాసముద్రం' సినిమా పోస్టర్​
  • కోలీవుడ్​ నటుడు బాబీ సింహా ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం 'వసంత కోకిల'. నూతన సంవత్సరం సందర్భంగా ఆ చిత్రం నుంచి సెకండ్​ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రాన్ని పాన్​ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
    Tollywood Movie Updates released For the occasion of new year
    'వసంత కోకిల' సినిమా సెంకడ్​ లుక్​
  • బాలీవుడ్​లో సూపర్​హిట్టైన 'అంధాదున్​' తమిళ రీమేక్​ అప్​డేట్​ వచ్చేసింది. ఈ చిత్రానికి 'అంధగన్'​ అనే టైటిల్​ను ఖరారు చేశారు. ఇందులో నటి సిమ్రన్​ కీలకపాత్ర పోషించనున్నారు. 'అంధాదున్​' తెలుగు రీమేక్​లో హీరో నితిన్​ నటిస్తున్నారు.
    Tollywood Movie Updates released For the occasion of new year
    'అంధాదున్' తమిళ రీమేక్​ టైటిల్​ పోస్టర్​
  • సందీప్​ కిషన్​ హీరోగా తెరకెక్కిన 'నగరం' చిత్రాన్ని.. బాలీవుడ్​లో 'ముంబయి కర్' అనే టైటిల్​తో రూపొందిస్తున్నారు. ఇందులో 'మీర్జాపూర్​' నటుడు విక్రాంత్​ మాస్సే, కోలీవుడ్​ స్టార్​ హీరో విజయ్​ సేతుపతి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్​ శివన్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు.
    Tollywood Movie Updates released For the occasion of new year
    'ముంబయికర్​' సినిమా ఫస్ట్​లుక్​
  • హాస్యనటుడు సప్తగిరి హీరోగా 'ఎయిట్​(8)'​ చిత్రం రూపొందుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఆ సినిమా ఫస్ట్​లుక్​ను చిత్రబృందం విడుదల చేసింది.
    Tollywood Movie Updates released For the occasion of new year
    సప్తగిరి నటిస్తోన్న 'ఎయిట్​(8)' సినిమా ఫస్ట్​లుక్​

ఇదీ చూడండి: ఉత్తమ నటుడు 'ఏజెంట్​ ఆత్రేయ'.. ఉత్తమ చిత్రం 'జెర్సీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.