ETV Bharat / sitara

ఆ సినిమాలో విక్కీకి జోడీగా సారా!

author img

By

Published : Mar 26, 2021, 8:58 AM IST

Sara Ali Khan, Vicky Kaushal
విక్కీకి జోడీగా సారా

బాలీవుడ్​లో ఓ కొత్త జోడీ తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. విక్కీ కౌశల్​ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం 'ది ఇమ్మోర్టల్​ అశ్వత్థామ'. ఇందులో విక్కీకి జోడీగా సారా అలీఖాన్​ను చిత్రబృందం ఎంపికచేసినట్లు సమాచారం.

బాలీవుడ్​లో ఓ కొత్త జోడీ తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. యువ కథానాయకుడు విక్కీ కౌశల్ నటిస్తున్న చిత్రం 'ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ'. ఇందులో విక్కీ జోడీగా సారా అలీఖాన్​ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

చారిత్రక నేపథ్యంతో కూడిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిచనున్నారు. ఇందులో సారా పాత్రకు సంబంధించి కూడా భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని బాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ ప్రేమ కథలు, సరదా పాత్రల్లో నటించిన సారా స్టంట్స్​ చేయబోతుందని సమాచారం.

ఈ చిత్రంలోని పాత్ర కోసం విక్కీ ఇప్పటికే వర్కౌట్లు మొదలు పెట్టేశాడు. గుర్రపు స్వారీ, విలువిద్య లాంటి వాటిలో శిక్షణ తీసుకుంటున్నాడు. వాటికి సంబంధించిన విశేషాలు సామాజిక మాధ్యమాల్లోనూ పంచుకుంటున్నాడు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి: 'పఠాన్​' కోసం షారుక్​​కు భారీ రెమ్యూనరేషన్!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.