ETV Bharat / sitara

పవన్ రిప్లైను ఫ్రేమ్ కట్టించుకుంటా: సంపూ

author img

By

Published : Sep 3, 2020, 3:13 PM IST

Updated : Sep 3, 2020, 3:21 PM IST

పవన్ రిప్లైను ఫ్రేమ్ కట్టించుకుంటా: సంపూ
పవన్ రిప్లైను ఫ్రేమ్ కట్టించుకుంటా: సంపూ

బుధవారం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్​లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా తనకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నారు పవన్. యువ నటుడు సంపుర్ణేష్ బాబుకు కూడా రిప్లై ఇవ్వగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు సంపూ.

బుధవారం పవర్​స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు పవన్​కు జోరుగా శుభాకాంక్షలు చెప్పారు. అలా విష్ చేసిన ప్రతి ఒక్కరికీ కల్యాణ్​ ధన్యవాదాలు తెలుపుతూ పేరుపేరునా రిప్లై ఇస్తూ ట్విట్టర్​లో సందడి చేస్తున్నారు. తాజాగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ ట్వీట్​కూ రిప్లై ఇచ్చారు​ పవర్ స్టార్. దీంతో ఆ యువ నటుడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ఆ రిప్లై చూసిన సంపూ.. దానిని ఫొటో ఫ్రేమ్ కట్టించుకుంటానని తెలిపాడు. "మీ దగ్గర నుంచి రిప్లై రావడం చాలా సంతోషంగా ఉంది" అంటూ తన ఆనందాన్ని వెల్లడించాడు. సంపూతో పాటు చాలామంది యువ హీరోలకు పవన్ రిప్లై ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.

  • అన్నా, మీ దగ్గర నుంచి ఈ రిప్లై రావటం , ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటాను, ఎంత సంతోషంగా ఉందొ మాటల్లో చెప్పలేను 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍 https://t.co/UtVdEtukmD

    — Sampoornesh Babu (@sampoornesh) September 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated :Sep 3, 2020, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.