ETV Bharat / sitara

రిషీ కపూర్​ చివరి వీడియో ఇదేనా?

author img

By

Published : Apr 30, 2020, 7:18 PM IST

రిషీ కపూర్​ చివరి వీడియో ఇదేనా?
రిషి కపూర్

బాలీవుడ్ స్టార్ రిషీ కపూర్.. చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఇందులో భాగంగా ఆసుపత్రి సిబ్బందిలోని వ్యక్తిని దీవిస్తూ కనిపించారు ఈ నటుడు.

బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషీ కపూర్.. క్యాన్సర్​తో పోరాడుతూ, ముంబయిలోని రిలయన్స్ ఆసుపత్రిలో నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించింది. అయితే రిషీకి సంబంధించిన చివరి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్​గా మారింది.

ఇందులో మంచంపై రిషీ కపూర్ పడుకుని ఉండగా, ఆయన పక్కనే ఉన్న ఆసుపత్రి సిబ్బందిలోని ఓ వ్యక్తి.. ఈ నటుడి సినిమా 'దివానా'లోని పాట పాడుతూ కనిపించాడు. అనంతరం అతడిని దీవించారు రిషీ. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని, రెండు నెలల క్రితం రెగ్యులర్​ చెకప్​ కోసం వెళ్లినప్పటదని అంటున్నారు.

ఈ రోజు సాయంత్రం ముంబయిలోని చందన్​వాడి స్మశానవాటికలో రిషీ కపూర్​ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్​బీర్ కపూర్, సోదరుడు రణ్​ధీర్ కపూర్​తో పాటు నటీనటులు అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, ఆలియా భట్ తదితరులు హాజరై ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు.

rishi kapoor last riot
రిషీ కపూర్ అంత్యక్రియల దృశ్యం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.