ETV Bharat / sitara

'హిట్'​ హిందీ రీమేక్​కు హీరో దొరికేశాడోచ్​..

author img

By

Published : Jul 15, 2020, 12:47 PM IST

rajkumar latest news
హిట్​ హిందీ రీమేక్​కు హీరో దొరికేశాడోచ్​..

బాలీవుడ్​లో విలక్షణ నటుల్లో ఒకరిగా రాణిస్తున్న రాజ్​కుమార్​ రావ్​.. మరో క్రైమ్​ థ్రిల్లర్​ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగులో ప్రేక్షకుల మనుసు దోచిన 'హిట్'​ చిత్రం హిందీ రీమేక్​లో అతడు కనువిందు చేయనున్నాడు. శైలేష్‌ కొలను దర్శకత్వంలోనే తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది.

తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద ఫలితాన్ని అందుకున్న చిత్రం 'హిట్​'. ప్రస్తుతం హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమౌతోంది. బాలీవుడ్​ నటుడు రాజ్​కుమార్​ రావ్​ ఈ రీమేక్​లో నటించనున్నాడు. సస్పెన్ష్​ థ్రిల్లర్​గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పోలీసు పాత్రలో కనువిందు చేయనున్నాడు.​

తెలుగులో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన శైలేష్​ కొలను.. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. మిస్సయిన ఓ అమ్మాయిని హిట్​(హోమిసైడ్​ ఇంటర్​వెన్షన్​ టీమ్) బృందం పట్టుకోగలిగిందా? లేదా? అనేది కథాంశం.

"సినిమా చూడగానే వెంటన్​ కనెక్ట్​ అయిపోయా. చాలా అద్భుతమైన స్టోరీ. ప్రస్తుతకాలానికి తగ్గట్టుగా కథనం ఉంది. నటుడిగా నేను విభిన్న పాత్రలు చేయాలని అనుకుంటాను. హిట్​ చిత్రంతో అలాంటి ఓ అవకాశం వచ్చింది. శైలేష్​, దిల్​ రాజు గారితో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఉన్నా."

-- రాజ్​కుమార్​, బాలీవుడ్​ నటుడు

'హిట్​' చిత్రానికి గ్లోబల్​గా ఆకట్టుకునే కథనం ఉందన్న శైలేష్​.. చిన్నపాటి మార్పులు చేర్పులతో అందరికీ వర్తిపంజేసేలా చేయొచ్చని అన్నాడు. హిందీ రీమేక్​ 2021లో ప్రీ-ప్రొడక్షన్​ పనులు ప్రారంభించుకోనుంది. నటీనటులు, సాంకేతిక విభాగం వివరాలు తెలియాల్సి ఉంది.

ఇప్పటికే నాని నటించి 'జెర్సీ' చిత్రం హిందీలో తెరకెక్కుతోంది. షాహిద్​ నటించిన ఈ చిత్రానికి దిల్​రాజ్​ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు హిట్​ చిత్రంతోనూ మరోసారి బాలీవుడ్​ తెరపై అడుగుపెడుతున్నారు.

మ‌రోవైపు.. హిట్ తెలుగు సీక్వెల్‌కీ ప్ర‌య‌త్నాలు మొద‌లయ్యాయి. పార్ట్​-1 క్లైమాక్స్ లోనే హింట్​ ఇచ్చిన డైరెక్టర్​.. దానికి త‌గిన‌ట్టుగా స్క్రిప్టు త‌యారు చేసే పనిలో ఉన్నారు. అయితే ఇందులో విశ్వ‌క్​సేన్​ న‌టిస్తాడా? మ‌రో హీరో చేస్తాడా? అనే సంగ‌తి తెలియాల్సి వుంది. హిట్​ను తెలుగులో నాని తెరకెక్కించగా.. విశ్వక్​, రుహానీ శర్మ నటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.