ETV Bharat / sitara

'సినీ పరిశ్రమలో భారీ మార్పులకు కారణం ఓటీటీలే!'

author img

By

Published : Jun 23, 2021, 6:56 PM IST

Priyanka Chopra says OTT shattered 'monopoly of specific people' in Bollywood
'సినీ పరిశ్రమలో భారీ మార్పులకు కారణం ఓటీటీలే!'

ఓటీటీ(OTT)లు చిత్రపరిశ్రమలో భారీ మార్పులకు కారణమయ్యాయని అభిప్రాయపడ్డారు స్టార్​ హీరోయిన్స్​ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), తమన్నా (Tamannaah). డిజిటల్​ వేదికల ద్వారా అనేకమంది కొత్త రచయితలు, నటీనటులకు, దర్శకులకు అవకాశం కల్పించినట్లైందని వారు తెలిపారు. అయితే ఈ ఓటీటీల వల్ల చిత్రసీమలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న మూసధోరణికి స్వస్తి పలికినట్లైందని వెల్లడించారు.

డిజిటల్​ వేదికల వల్ల చిత్ర పరిశ్రమలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) అభిప్రాయపడ్డారు. ఓటీటీల ద్వారా ప్రేక్షకులకు విభిన్న కథలను అందించగలుగుతున్నారని అన్నారు. ఓటీటీ (OTT) సంస్థల పనితీరుతో చిత్రపరిశ్రమలో గుత్తాధిపత్యానికి స్వస్తి పలికినట్లైందని చెప్పారు. డిజిటల్​ ప్లాట్​ఫామ్​ జీ5 (Zee 5) యూఎస్​లో మంగళవారం ఏర్పాటు చేసిన వర్చువల్​ విలేకర్లు సమావేశంలో ప్రియాంకా చోప్రా ఈ విధంగా మాట్లాడారు.

"డిజిటల్​ స్ట్రీమింగ్​ ఫ్లాట్​ఫామ్స్​ స్వేచ్ఛ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రతిభను గుర్తించేందుకు వీలైంది. సాధారణంగా సినిమాలంటే నాలుగు పాటలు, కొన్ని పోరాట సన్నివేశాలు ఉండేవి. ఇదే ఫార్ములాతో బాలీవుడ్​లో కొన్నేళ్లు చిత్రాలు రూపొందుతున్నాయి. కానీ, ఇప్పుడు ఆ ఆచారానికి ఓటీటీ ద్వారా స్వస్తి పలికినట్లైంది. ఆకట్టుకునే కథాంశాలతో రూపొందించి ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు వీలగుతుంది. డిజిటల్​ వేదికలు.. కొత్త రచయితలు, నటీనటులు, దర్శకనిర్మాతలను చిత్రసీమకు పరిచయం చేయడమే కాకుండా ప్రేక్షకుడికి ఇంట్లోనే థియేటర్​ అనుభూతిని కలిగిస్తున్నాయి. ఇప్పుడు ప్రజలకు అసలైన కథలను చెప్పేందుకు సమయం వచ్చిందని భావిస్తున్నా. ఇప్పుడు మంచి కంటెంట్​ ఉన్న కథలను ప్రేక్షకులు ఇంట్లోనే ఆస్వాదిస్తున్నారు".

- ప్రియాంకా చోప్రా, బాలీవుడ్​ నటి

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నటించిన 'వైట్​ టైగర్​' (White Tiger on Netflix) చిత్రంతో తొలిసారి ఓటీటీ అరంగేట్రం చేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది.

ప్రేక్షకుల అభిరుచి మారింది..

గత 7-8 ఏళ్ల నుంచి సినిమాల పరంగా ప్రేక్షకుల అభిరుచిలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయని స్టార్​ హీరోయిన్​ తమన్నా (Tamannaah) అన్నారు. చిత్రసీమలో కొన్నేళ్లుగా సాగుతున్నా స్టార్​డమ్​ అనే సంప్రదాయానికి ఇప్పుడు కాలం చెల్లిందని ఆమె అభిప్రాయపడ్డారు.

"గతంతో పోలిస్తే చిత్రసీమలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అభిమానుల ఆదరణ ఆధారంగా నటులకు స్టార్​డమ్​ వచ్చేది. గత కొన్నేళ్లుగా ఇదే సంప్రదాయం కొనసాగింది. కానీ, ఓటీటీలు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమాలను ఎంచుకోవడంలో ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ లభించింది. చిత్రపరిశ్రమకు కొత్త రచయితలు, నటీనటులు, దర్శకులను పరిచయం చేయడంలో డిజిటల్​ వేదికలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి" అని తమన్నా వెల్లడించారు.

ఆహా ఓటీటీలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'లెవెన్త్​ అవర్​' (11th Hour) డిజిటల్​ వేదికలో అడుగుపెట్టారు హీరోయిన్​ తమన్నా. ఆ తర్వాత తమిళంతో సహా అనేక భాషల్లో రూపొందిన 'నవంబరు స్టోరీస్​' (November Stories) వెబ్​సిరీస్​తోనూ తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఇదీ చూడండి.. MAA Elections: 'మా' ఎన్నికల్లో బాలకృష్ణ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.