ETV Bharat / sitara

'లింగ వివక్షలేని సమాజాన్ని త్వరలోనే చూస్తాం'

author img

By

Published : Mar 31, 2020, 12:37 PM IST

Priyanka Chopra hopes her children don't witness gender discrimination
'లింగ వివక్షలేని సమాజాన్ని త్వరలోనే చూస్తాం'

సమాజంలో లింగ వివక్ష లేని వ్యవస్థను నమ్ముతానంటోంది బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా. భవిష్యత్​లో ఈ సమస్య గురించి తన పిల్లలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

లింగ వివక్ష లేని సమాజాన్ని త్వరలోనే చూస్తామని బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె పిల్లలు లింగ వివక్ష గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

"నేను లింగ వివక్ష లేని సమాజం కావాలని కోరుకునే వ్యక్తిని. నా జీవితకాలంలో అలాంటి సమాజాన్ని చూస్తానని ఆశిస్తున్నా. లేడీ ఓరియెంటెడ్​ మూవీస్​కు బదులుగా సినిమా అని, మహిళా దర్శకులకు బదులుగా దర్శకులని, మహిళా అథ్లెట్లకు బదులుగా అథ్లెట్లు అని త్వరలోనే అంటారని అనుకుంటున్నా. లింగ వివక్ష లేని సమాజంలో నా పిల్లలు పెరుగుతారని నమ్ముతున్నా. ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వస్తున్నారు. నాాలాగే వారికి.. వారి తల్లిదండ్రులు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా."

- ప్రియాంకా చోప్రా, బాలీవుడ్​ నటి

కరోనాపై పోరుకు ప్రియాంక, కత్రినా సాయం

కరోనా వైరస్​పై పోరుకు బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్, మరో నటి కత్రినా కైఫ్ మద్దతు తెలిపారు. అందుకోసం తమవంతు సహకారాన్ని అందించారు.

ప్రియాంక, నిక్ జోనస్​ కలిసి కొంత డబ్బును ప్రధానమంత్రి సహాయనిధి, యునిసెఫ్, గూంజ్, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్, నో కిడ్ హంగ్రీ, సాగ్-అఫ్ట్రా సహా 10 స్వచ్ఛంద సంస్థలకు విరాళాన్ని ప్రకటించారు. మరోనటి కత్రినా కైఫ్​ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధితో పాటు ప్రధానమంత్రి సహాయనిధికి విరాళాన్ని ప్రకటించింది.

ఇదీ చూడండి.. నర్సుగా మారి వైద్య సేవలందిస్తున్న నటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.